భారీ బడ్జెట్ తో ఒక తెలుగు నిర్మాత ఓ తెలుగు దర్శకుడితో తమిళంలో సినిమా తీశాడనే అభిమానంతో హీరో విజయ్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్లో పాల్గొంటాడనే ఆశ అడియాశే అయ్యేలా ఉంది. చెన్నైలో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ కి హాజరవ్వడమే కాదు స్టేజి మీద పాట పాడి డాన్స్ చేసిన విజయ్ హైదరాబాద్ కు మాత్రం ససేమిరా రానని తెగేసి చెప్పినట్టు చెన్నై టాక్. ఒకప్పుడు తనకు ఫాలోయింగ్ లేదు కానీ తుపాకీతో మొదలు ఇక్కడ డీసెంట్ మార్కెట్ ఏర్పడిన మాట వాస్తవం. తరచూ ఇతని పాత హిట్లు స్పెషల్ ప్రీమియర్లుగా వేసిన దాఖలాలు ఈ మధ్యే ఉన్నాయి. అలాంటిది కొంచెం ఫోకస్ పెడితే మంచి ఫలితాలుంటాయి.
కానీ విజయ్ మాత్రం అదేమీ జాన్తా నై అంటున్నాడు కాబోలు. వారసుడుకి తెలుగులో ఏమంత బజ్ లేదు. పైగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల ఊర మాస్ ట్రైలర్లు చూశాక మన జనానికి డబ్బింగ్ బొమ్మలు కంటికి ఆనవు. అజిత్ కేసు వేరు. తెగింపు అమ్మిందే చాలా తక్కువ రేట్లకు. పైగా దాని నిర్మాత బోనీ కపూర్ ఏపీ తెలంగాణ బిజినెస్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. సో బొమ్మ ఆడినా ఆడకపోయినా సేఫ్ అవుతుంది. కానీ వారసుడు సంగతి అలా కాదు. భారీ ఎత్తున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయం ఇంకా తేలలేదు మరికొద్ది గంటల్లో అంటూ సాగదీస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా హీరోలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రమోషన్లో భాగమవ్వడం ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అవసరం. విక్రమ్ కోసం కమల్ హాసన్ రెండు మూడు సార్లు భాగ్యనగరానికి వచ్చారు. పొన్నియన్ సెల్వన్ ని మార్కెట్ చేసుకోవడానికి టీమ్ మొత్తం ఇక్కడికే వచ్చింది. సూర్య, కార్తీలు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నిత్యం ప్రచారానికి వస్తూ పోతూ ఉంటారు. కానీ విజయ్ మాత్రం తన రూటే వేరు అంటున్నారు. ఇంత గ్రాండ్ స్కేల్ మీద తీసినందుకు, లో ప్రొఫైల్ లో ఉన్న వారసుడు మీద అంచనాలు పెంచేందుకైనా ఓసారి వచ్చి ఉంటే బాగుండేది. వారసుడు తెలుగు ట్రైలర్ నే ట్విట్టర్ షేర్ చేయనప్పుడు ఇంకేం ఆశిస్తాం.
This post was last modified on %s = human-readable time difference 5:36 pm
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…