ఒకప్పుడు విలన్ పాత్రలకు ప్రకాష్ రాజ్ తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో ఆయన పెర్ఫార్మన్స్ చూసి అసలు బాష కన్నడలో అంతగా పట్టించుకోకపోతే టాలీవుడ్ దర్శకులు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అందుకే తెలుగు అంటే ప్రత్యేక మక్కువ చూపించే ఈ విలక్షణ నటుడు ఆ తర్వాత ఎక్కువ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మంచితనానికి మారుపేరుగా కనిపించే పాత్రలే ఎక్కువగా వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఫుల్ లెన్త్ విలనీతో దర్శనమివ్వబోతున్నారు. అది కూడా ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో కావడం విశేషం.
నిన్న విడుదలైన వాల్తేరు వీరయ్య చివరి షాట్ లో చిరంజీవి రవితేజ పరస్పరం ఛాలెంజ్ చేసుకునే సన్నివేశంలో ప్రకాష్ రాజ్ హీరో గ్యాంగ్ లో సభ్యుడిగా కనిపిస్తారు. మరో సీన్ లో ఖరీదైన సూటు బూటు వేసుకుని పెద్ద మాఫియాను నడిపించుకుంటూ తీసుకెళ్లే డిఫరెంట్ గెటప్ లో చూపిస్తారు.
అంటే ముందు చిరు పక్కన ఉంటూనే ఏదో వెన్నుపోటు పొడిచే ట్విస్టు ఉందని ఈజీగా అర్థమైపోయింది. మరోవైపు వారసుడులో విజయ్ కుటుంబాన్ని విడగొట్టి అతని కంపెనీని ఆక్రమించుకోవాలని చూసే ప్రతినాయకుడు కూడా ప్రకాష్ రాజ్ అనే క్లారిటీ దాని ట్రైలర్ లో ఇచ్చారు. ఇది రొటీన్ టచ్ లోనే అనిపిస్తోంది.
ఒకప్పుడు వెరైటీ విలనిజం తో మెప్పించి ఆ తర్వాత అవే క్యారెక్టర్లు చేసి చేసి బోర్ కొట్టించేసిన ప్రకాష్ రాజ్ మళ్ళీ అలాంటి పాత్రలతోనే ముందుకు రావడం గమనార్హం. నిజానికి సౌత్ లో విలన్ల కొరత విపరీతంగా ఉంది. ఆశిష్ విద్యార్ధి, ముఖేష్ ఋషి లాంటి వాళ్ళు మరీ మొనాటనీ అయ్యారు. జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి టైపు బాలీవుడ్ బ్యాచ్ ఐరన్ లెగ్ అనిపించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మళ్ళీ పాత కాపు ప్రకాష్ రాజే బెటర్ ఛాయస్ గా నిలుస్తున్నారు. మరి ఈ రెండు క్రేజీ మూవీస్ లో ఆయన్ని కొత్తగా ఏమైనా వాడుకుంటున్నారేమో చూడాలి. వచ్చే నెల విడుదలయ్యే శాకుంతలంలోనూ కనిపించబోతున్నారు
This post was last modified on January 8, 2023 2:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…