సంక్రాంతి బరిలో అసలే అంచనాలు లేకుండా వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. యువి సంస్థ నిర్మాణమే అయినప్పటికీ మహా అయితే మంచి స్క్రీన్లు దక్కించుకోగలరు కానీ జనాన్ని థియేటర్ల దాకా రప్పించలేరుగా. కంటెంట్ బాగుండొచ్చు. ట్రైలర్ చూశాక పాజిటివ్ వైబ్స్ కనిపించాయి.
అలా అని వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి మాన్స్ టర్స్ ని ఎదురుగా పెట్టుకుని తలపడటం అంటే రిస్క్. పైగా సంతోష్ శోభన్ కి థియేటర్ మార్కెట్ లేదు. మారుతీ తీసిన మంచి రోజులు వచ్చాయి ఫ్లాప్ కాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరీ దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
పోనీ దర్శకుడు ఏమైనా ఇమేజ్ ఉన్నవాడైతే ఆ బ్రాండ్ మీద మార్కెట్ చేయొచ్చు. ఆ ఛాన్సూ లేదు. అయినా సిద్ధపడ్డారంటే ఆ కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఫైనల్ అవుట్ ఫుట్ బాగా వచ్చిందనా లేక మరొకటా అనేది అంతు చిక్కడం లేదు.
గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణిలు పరస్పరం తలపడినప్పుడు మధ్యలో శతమానంభవతి కూడా లాభపడింది. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడమే కాదు జాతీయ అవార్డు కూడా సాధించింది. బహుశా దాన్ని మనసులో పెట్టుకునే తమకూ ఇలాంటి ఫలితం వస్తుందని యువి సంస్థ భావిస్తోంది కాబోలు. ఆ టైంలో శర్వా మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కింది
ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. రేస్ లో వారసుడు ఉంది. దిల్ రాజు ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో చూశాం. పదకొండున వస్తుందా లేక ఒకటి రెండు రోజులు లేట్ అవుతుందా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ కనీసం ఒక వారంపాటు కౌంట్ పరంగా ఎక్కువ స్క్రీన్లలోనే ఉంటుంది.
ఇవి చాలక అజిత్ తెగింపు కూడా ఉంది. 2017 నాటి పరిస్థితులకు ఇప్పటికి గ్యాప్ తక్కువే ఉన్నా మార్పులు చాలానే వచ్చాయి. అయినా కళ్యాణం కమనీయం సాహసం చేయడం చూస్తే సంథింగ్ సంథింగ్ అనే డౌట్ వస్తోంది. ఆ మధ్య స్వాతిముత్యం ఇలాగే గాడ్ ఫాదర్ ఘోస్ట్ మధ్యలో వచ్చి సినిమాలో మ్యాటర్ ఉన్నా నెగ్గలేకపోయిన సంగతి గుర్తేగా
This post was last modified on January 8, 2023 11:57 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…