ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళ భారీ చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆ సినిమా విడుదల ఏర్పాట్లలో టీం అంతా తలమునకలై ఉన్న సమయంలో చిత్ర బృందంలోని ఒక కీలక వ్యక్తి హఠాత్తుగా మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు.. సునీల్ బాబు. అతను వారిసుకు ఆర్ట్ డైరెక్టర్.
ఇదే కాదు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటికే అతను ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశాడు. సునీల్ బాబు వయసు 50 ఏళ్లు. గురువారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రాగా.. సునీల్ బాబును కేరళలోని ఎర్నాకులంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ అతను శుక్రవారం తుది శ్వాస విడిచాడు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఉన్నారు.
సునీల్ మరణ వార్త తెలిసి వారిసు టీం విషాదంలో మునిగిపోయింది. ఆయనకు నివాళిగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసింది శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ. చిత్ర బృందలోని వాళ్లే కాదు.. భారతీయ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులంతా సునీల్ బాబు మరణంతో షాక్ అవుతున్నారు. లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ శిష్యుడు సునీల్ బాబు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుని.. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్‌గా మారిన సునీల్ బాబు.. ఇండియాలో టాప్ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకడిగా ఎదిగాడు.
హిందీలో లక్ష్య, గజిని, స్పెషల్ చబ్బీస్, ఇకబ్బాల్… తమిళంలో గజిని, విల్లు, కాసనోవా, మలయాళంలో భీష్మపర్వం, బెంగళూరు డేస్ లాంటి ప్రముఖ చిత్రాలకు సునీల్ ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. తెలుగులో ఊపిరి, మహర్షి, సీతారామం లాంటి చిత్రాలకు ఆయన పని చేశాడు. ఊపిరి, మహర్షి సినిమాలకు సునీల్ పనితనం నచ్చి వారిసుకు కూడా వంశీ ఆయన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు. ఇదే ఆయనకు చివరి చిత్రం అయింది.
This post was last modified on %s = human-readable time difference 10:16 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…