Movie News

‘బాహుబలి’ ప్రెజర్ గురించి ప్రభాస్..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తే ‘అన్‌స్టాపబుల్’ షోలో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ నుంచి పార్ట్-1 ఎంతో ఆక్టటుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడి.. ఒక్కసారిగా సబ్‌స్క్ర్రైబర్లు ఎగబడడంతో ‘ఆహా’ సర్వర్ నిలిచిపోయి కాసేపు యాప్ పని చేయకపోవడం చర్చనీయాంశం అయింది. చాలా సరదాగా సాగిపోయిన పార్ట్-1 వారం పాటు బాగా సందడి చేసింది. ఇప్పుడిక పార్ట్-2 కూడా వచ్చేసింది.

ఈ భాగం కూడా సరదాగానే సాగుతూ.. కొంచెం సీరియస్ టర్న్ కూడా తీసుకుంది. తన పెదనాన్న కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు ప్రభాస్. ఆయన గురించి గొప్పగా మాట్లాడాడు. ఇందులోనూ హీరోయిన్ల గురించి కొంటె ప్రశ్నలు ఎదురయ్యాయి. గోపీచంద్ పక్కనుండగా ప్రభాస్ చాలా చమత్కారంగా మాట్లాడుతూ అలరించాడు. ఇవన్నీ పక్కన పెడితే.. ‘బాహుబలి’ తర్వాత తన మీద నెలకొన్న అంచనాల వల్ల పడుతున్న కష్టం, ఒత్తిడి గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“బాహుబలి సినిమా మేం ఊహించని స్థాయిలో విజయం సాధించింది. అలాంటి సినిమా తర్వాత ఏం చేయాలి.. దేశంలో అందరికీ నచ్చేలా ఎలాంటి చిత్రం చేయాలి.. కొత్తగా ప్రయత్నించాలా.. అలా చేస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా.. ఇలా రకరకాల ప్రశ్నలతో గందరగోళం ఎదుర్కొన్నాను. ఎందుకంటే ‘బాహుబలి’తో మాకు అన్ని రాష్ట్రాల్లో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులను అలరించడం కోసం కష్టపడుతున్నా. కానీ ఆ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అవి నిరాశ పరిచినా వెనుకంజ వేయకూడదు. ప్రేక్షకులను మెప్పించడానికి కష్టపడుతూనే ఉంటా” అని ప్రభాస్ చెప్పాడు.

ప్రభాస్ పడే టెన్షన్, ఒత్తిడి గురించి గోపీచంద్ మాట్లాడుతూ.. “ప్రభాస్ చాలా కూల్‌గా కనిపిస్తాడు కానీ.. ప్రేక్షకులను మెప్పించే విషయంలో ప్రెజర్ ఫీలవుతాడు. ఒత్తిడిలో ఉన్నపుడు అతను వేరే ప్రపంచంలో ఉంటాడు. ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నాడు అనిపిస్తుంది” అని గోపీచంద్ అన్నాడు.

This post was last modified on January 6, 2023 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

10 minutes ago

చ‌ర‌ణ్‌ vs నాని.. ఇద్ద‌రూ త‌గ్గేదే లే

సినిమాలకు సంబంధించి క్రేజీ సీజ‌న్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజ‌న్‌కు బాగా…

2 hours ago

‘కూట‌మి’లో ప్ర‌క్షాళన‌.. త్వ‌ర‌లో మార్పులు?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీల ప‌రంగా పైస్థాయిలో నాయ‌కులు…

3 hours ago

జన నాయకుడు మీద ఏంటీ ప్రచారం

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…

3 hours ago

అసలు యుద్ధానికి అఖండ 2 సిద్ధం

సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది…

4 hours ago

చిరు వెంకీ కలయిక… ఎంతైనా ఊహించుకోండి

మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై…

6 hours ago