నందమూరి బాలకృష్ణకు మార్కెట్, కలెక్షన్ల పరంగా వీక్‌గా ఉండే ఏరియాల్లో యుఎస్ ఒకటి. బాలయ్య ఎక్కువగా చేసేది ఊర మాస్ సినిమాలు.. యుఎస్ ప్రేక్షకుల అభిరుచేమో అందుకు భిన్నంగా ఉంటుంది. అక్కడ క్లాస్ టచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే యుఎస్‌లో బాగా ఆడాయి తప్ప.. చాలా వరకు బాలయ్య సినిమాలు అక్కడ నిరాశపరిచాయి. ఐతే బాలయ్య చివరి సినిమా ‘అఖండ’కు అక్కడ మంచి ఫలితమే వచ్చింది.
ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రి సేల్స్‌కు యుఎస్‌లో వస్తున్న స్పందన చూసి అందరూ షాకైపోతున్నారు. విడుదలకు పది రోజుల ముందే ఈ చిత్రం ప్రి సేల్స్ ద్వారా లక్ష డాలర్లకు పైగా కలెక్ట్ చేయడం అక్కడి ట్రేడ్ వర్గాలకు షాక్. అన్ని ఏరియాల్లోనూ టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
మామూలుగా బాలయ్యతో పోలిస్తే చిరంజీవికి యుఎస్‌లో మార్కెట్ కొంచెం పెద్దదే. ఆయన సినిమాలే ఎక్కువ లొకేషన్లు, స్క్రీన్లలో రిలీజవుతుంటాయి. కానీ ‘వీరసింహారెడ్డి’కి మాత్రం చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువ లొకేషన్లు, స్క్రీన్లు కేటాయించారు.
టికెట్ల అమ్మకాల్లో కూడా బాలయ్య సినిమాదే పైచేయిగా ఉంటోంది. మొదట్లో బాలయ్య సినిమాకు ప్రి సేల్స్ పరంగా కనిపించిన ఊపు చూసి.. ఇది ఒక కమ్యూనిటీ పనిగట్టుకుని టికెట్లు కొనడం వల్ల జరుగుతోందనే చర్చ జరిగింది. కానీ తర్వాత కూడా ‘వీరసింహారెడ్డి’దే పైచేయిగా వస్తోంది.
‘అఖండ’ సూపర్ సక్సెస్ కావడం.. ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలయ్యకు యూత్, క్లాస్ ఆడియన్స్‌లోనూ ఫాలోయింగ్ పెరగడం, ‘వీరసింహారెడ్డి’కి పాజిటివ్ బజ్ ఉండడం ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా యుఎస్ ప్రి సేల్స్ ద్వారా ‘వీరసింహారెడ్డి’ 1.61 లక్షల డాలర్లు వసూలు చేయగా.. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి సేల్స్ 1.31 లక్షల డాలర్లకు చేరుకుంది.
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…