Dil Raju
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయిపోతున్నాడు. అందుకు ప్రధాన కారణం.. ఆయన నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో ఆయనే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాలు పోటీలో ఉండగా.. వాటికి దీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా థియేటర్లను కొన్ని ఏరియాల్లో ‘వారసుడు’కు అట్టిపెట్టడం వివాదస్పదమై.. దీని మీద చాన్నాళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య అభిమానులు ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బాలయ్యపై. సరైన టైం కోసం ఎదురు చూస్తున్న వారికి ‘వారిసు’ తమిళ ఆడియో వేడుక.,. ఈ సినిమా ట్రైలర్ మంచి అవకాశంగా కనిపించాయి., ఇప్పటికే తెలుగులో వచ్చిన చాలా సినిమాల కలబోతలాగా ఈ సినిమా ఉండడం, కొత్తదనం కనిపించకపోవడంతో.. ట్రైలర్ లాంచ్ అయినా కాసేపటి నుంచే విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కొన్ని గంటల్లో వందల కొద్దీ మీమ్స్ వచ్చి పడిపోయాయి ఈ సినిమా మీద. ఇదంతా ఒకెత్తయితే.. చెన్నైలో ‘వారిసు’ ఆడియో వేడుక సందర్భంగా దిల్ రాజు చేసిన ప్రసంగం మీద జరుగుతున్న ట్రోలింగ్ మరో ఎత్తు. రాజు ఇంగ్లిష్‌లో్ వీక్ అన్న సంగతి తెలిసిందే. ఆయనకు తమిళం కూడా రాదు. ఐతే ‘వారిసు’ వేడుకలో కొంచెం ఇంగ్లిష్, కొంచెం తమిళం కలిపి మాట్లాడడానికి రాజు ప్రయత్నించాడు. కానీ అది తేడా కొట్టేసింది. ఈ స్పీచ్ మీద అటు తమిళ జనాలు.. ఇటు తెలుగు వాళ్లు పోటీ పడి మీమ్స్ తయారు చేస్తున్నారు.
రాజు కామెంట్లను ‘జిఫ్’లు కూడా చాలానే వచ్చేశాయి. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి ఇదే రచ్చ నడుస్తోంది. దిల్ రాజు ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ట్రోల్ అవుతున్నాడు.
This post was last modified on January 6, 2023 6:56 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…