Movie News

షారుఖ్ సినిమాపై కక్షగట్టేశారే..

ఒకప్పుడు ఇండియన్ సినిమాలో కింగ్‌ అనే స్థాయిలో హవా నడిపించిన షారుఖ్ ఖాన్ కొన్నేళ్ల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపులు ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి. అందులోనూ ‘జీరో’ సినిమా అయితే మరీ దారుణమైన వసూళ్లు తెచ్చుకుని షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన షారుఖ్.. తన తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు.

బాగా టైం తీసుకుని యాక్షన్ చిత్రాల స్పెషలిస్టు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ సినిమా చేశాడు. దీని మేకింగ్‌కు కూడా చాలా టైం తీసుకున్నారు. సినిమాకు బాగానే హైప్ కూడా వచ్చింది. ఐతే ఈ హైప్‌ను ఇంకా పెంచుదామని దీపికా పదుకొనే, షారుఖ్‌ల మీద తీసిన ఒక హాట్ సాంగ్‌ తాలూకు ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వైరల్ అయితే అయింది కానీ.. అందులో దీపిక అందాల ఆరబోత, హావభావాల మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయంలో ఒక ఊహించని వివాదం కూడా తలెత్తింది. దీపిక కాషాయ రంగు దుస్తులు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేయడానికి బీజేపీ, భజరంగ్ దళ్ మద్దతుదారులు తప్పుబట్టారు. కొందరు రాజకీయ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సినిమాను కొన్ని వారాల నుంచి ఇదే విషయమై టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. సెన్సార్ బోర్డు సైతం ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం పెద్ద షాక్. ఆ పాటలో కొన్ని మార్పులు చేర్పులేవో చేస్తున్నా సరే.. పరిస్థితి మారలేదు.

రిలీజ్ నెలలోకి వచ్చేయడంతో ప్రమోషన్ల ఊపు పెంచుదామని చూస్తున్న చిత్ర బృందానికి ఎక్కడికక్కడ అడ్డంకులు తప్పట్లేదు. ఉత్తరాదిన చాలా నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో ‘పఠాన్’ స్టాండీలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. భజ్ రంగ్ దళ్ ప్రతినిధులు వాటిని ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. జనాలు మరీ ఇంత సున్నితంగా తయారు కావడం.. మరీ ఈ స్థాయిలో ఒక సినిమాను టార్గెట్ చేయడం దారుణం అనే చెప్పాలి. షారుఖ్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైన సినిమా పరిస్థితి ఏమవుతుందో ఏమో అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

This post was last modified on January 6, 2023 2:33 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

22 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago