Movie News

కొత్త సినిమాలెన్ని వచ్చినా ఏం లాభం

ఇంకో వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలో మొదలుకాబోతున్న సంక్రాంతి దెబ్బకు ఈ ఫ్రైడే చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. ధైర్యం చేసిన కొద్ది నిర్మాతలకు సైతం కనీస ఫలితం వచ్చే తక్కువగానే ఉన్నాయి. గత వారం ఇరవై ఏళ్ళ పాత సినిమా పవన్ కళ్యాణ్ ఖుషి హల్చల్ చేస్తే ఈసారి ఆ బాధ్యతని మహేష్ బాబు ఒక్కడు తీసుకోబోతోంది. వీటికి హౌస్ ఫుల్ బోర్డులు తాజాగా వచ్చిన వాటికి ఖాళీ టికెట్ కౌంటర్లు కనిపించడం అసలు విచిత్రం. ఎలాగూ జనవరి 11 నుంచి ఒక్క స్క్రీన్ ఉండదు. అలాంటప్పుడు ఇంత తక్కువ సంబరానికి రిస్క్ ఎందుకు చేయాలని గమ్మునైపోయారు.

ఇవాళ రిలీజైన వాటిలో ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, ఏ జర్నీ టు కాశీ, ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవపురం వగైరా ఉన్నాయి. దేనికీ కనీస బజ్ లేదు. మౌత్ టాక్ ని నమ్ముకోవాల్సిందే. కింగ్ డం అఫ్ డైనోసార్స్ అనే ఇంగ్లీష్ మూవీని డబ్ చేసి వదిలారు కానీ ట్రైలర్ చూస్తే అందులో ఉన్న లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ కి దండం పెట్టాల్సిందే. కలర్ మాయాబజార్ నే మరోసారి తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్లంప్ ఇంకో అయిదు రోజుల పాటు భరించాలి. ఈ వీకెండ్ సైతం పూర్తిగా రవితేజ ధమాకా చేతుల్లోకి వెళ్లనుంది. అనూహ్యంగా అవతార్ 2కి శని ఆదివారాలు భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

సో ఈ రోజు వచ్చినవన్నీ తాత్కాలికంగా థియేటర్ల ఫీడింగ్ కి తప్ప చెప్పుకోదగినవి ఏవీ లేకపోవడం టాలీవుడ్ లవర్స్ కి నిరాశ కలిగించేదే. అయితే పండక్కు వచ్చే నాలుగైదు సినిమాలకు సరిపడా టికెట్ డబ్బులు సమకూరాలంటే ఇప్పుడు థియేటర్ల వైపు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం సినీ అభిమానుల్లో ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయంలు రావడానికి రెడీ అవుతుండటంతో ఎగ్జిబిటర్లు వాటికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. స్క్రీన్ కౌంట్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది.

This post was last modified on January 6, 2023 11:23 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

12 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

20 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago