Movie News

మనం ట్రోల్ చేసినా.. అక్కడ క్లిక్ కావచ్చు

నిన్న సాయంత్రమే సోషల్ మీడియాలోకి వచ్చింది ‘వారిసు/వారసుడు’ ట్రైలర్. ఆ ట్రైలర్ ఇలా రిలీజైందో లేదో.. అలా ట్రోల్స్ మొదలైపోయాయి. చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య చిత్రం ‘వీరసింహారెడ్డి’లకు థియేటర్లు తగ్గించి దిల్ రాజు ‘వారసుడు’కు తెలుగులో ఎక్కువ స్క్రీన్లు ఇచ్చుకుంటున్నారన్న కోపంతో ఇప్పటికే ‘వారసుడు’ మీద వ్యతిరేకతతో ఉన్నారు ఆ హీరోల ఫ్యాన్స్.

ఈ మధ్య దిల్ రాజు వివిధ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యల వల్ల చిరు, బాలయ్య ఫ్యాన్సే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా ఆయన మీద సదభిప్రాయంతో లేరు. దీంతో అందరూ కలిసి రాజు సినిమాను గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక సినిమాల కలబోతగా ఉండడం, కొత్తదనం కనిపించకపోవడంతో ‘వారసుడు’ మీద మీమ్స్ మోత మోగిపోతోంది. ఓవైపు చిరు, బాలయ్య సినిమాలతో పోటీ.. ఆల్రెడీ ఈ సినిమా మీద ఉన్న వ్యతిరేకత.. ఇంప్రెసివ్‌గా అనిపించని ట్రైలర్.. ఇవన్నీ చూస్తుంటే తెలుగులో ఈ సినిమా వర్కవుట్ కావడం కష్టమే అనిపిస్తోంది.

కానీ తమిళంలో ఈ సినిమా ఆడదు అనుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలా చూసి ఉండడం.. విజయ్‌కి ఇక్కడ పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడం, సంక్రాంతికి వేరే క్రేజీ సినిమాలు ఉండడం వల్ల మనకు ‘వారసుడు’ మీద అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కానీ తమిళంలో పరిస్థితి వేరు. అక్కడి విజయ్‌కి మామూలు ఫాలోయింగ్ లేదు. వాళ్లకు ఈ సినిమా కథ మరీ పాతగా ఏమీ అనిపించకపోవచ్చు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అక్కడ తక్కువే వచ్చాయి.

ట్రైలర్ చూస్తే విజయ్ అభిమానులు కోరుకునే ఫ్యాన్ మూమెంట్స్, డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్లు.. వేటికీ ఢోకా లేనట్లే ఉంది. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన హంగులన్నీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. కాబట్టి విజయ్ అభిమానులే కాక ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే ఆదరించే అవకాశముంది. సినిమా బాలేదు అనే టాక్ వస్తే తప్ప ‘వారిసు’ తమిళంలో హిట్టయ్యే అవకాశాలే ఎక్కువ.

This post was last modified on January 5, 2023 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

1 hour ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

1 hour ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

1 hour ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

4 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

5 hours ago