గత ఏడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్‌కు పెద్ద షాకే ఇచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. పూర్తిగా ఫామ్ కోల్పోయిన అతను ఒక కొత్త దర్శకుడితో కలిసి అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. లుక్స్, యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ కెరీర్ బెస్ట్ అనేలా కనిపించాడు ఆ చిత్రంలో కళ్యాణ్ రామ్. జానపద టచ్ ఉన్న ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. తన తర్వాతి సినిమాకు పూర్తిగా అవతారం, జానర్ మార్చేస్తుండడం విశేషం.
రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అతను చేసిన ‘అమిగోస్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేస్తున్న ఒక్కో లుక్ చూసి జనాలు షాకవుతున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు భిన్న రకాల పాత్రలు చేస్తుండడం విశేషం. ఆ మూడూ ఒక్క వ్యక్తికి సంబంధించిన లుక్స్ కాదు. మనుషులను పోలిన మనుషులు ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది.
తొలి లుక్‌లో మోడర్న్ కుర్రాడిలా స్టైలిష్‌గా కనిపించిన కళ్యాణ్ రామ్.. రెండో లుక్‌లో ఫార్మల్ డ్రెస్, కళ్లజోడుతో ఒక సగటు ఉద్యోగిలా కనిపించాడు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మూడో లుక్‌లో అతన పూర్తి భిన్నమైన అవతారంలో కినపించాడు. గుబురు గడ్డం, అందులో తెల్ల వెంట్రుకలు, జులపాల జుట్టు, చేతిలో గన్నుతో వయొలెంట్‌గా కనిపించాడు కళ్యాణ్. సినిమాలో ఇది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
‘118’ తరహాలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోందీ చిత్రం. ఇప్పటిదాకా డిఫరెంట్ లుక్స్‌తో రిలీజ్ చేసిన పోస్టర్లయితే భలే ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. మరి సినిమా కూడా అంతే భిన్నంగా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి రేసులో నిలిపారు మేకర్స్. ఆ నెల 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందీ చిత్రం. అదే రోజు సందీప్ కిషన్ ‘మైకేల్’ పాన్ ఇండియా మూవీతో ఇది పోటీ పడుతుంది.
This post was last modified on January 5, 2023 8:01 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…