Movie News

ఆ వేదికపై రాజమౌళి ఏం మాట్లాడాడు?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందింతే.. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకు కేంద్రమైన యుఎస్‌లో ఈ సినిమాను చూసి నేటివ్ అమెరికన్స్ ఎలా ఫిదా అయిపోయారో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. స్వతంత్రంగా పలు విభాగాల్లో పోటీలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’.. కొన్ని అవార్డులకు బలమైన పోటీదారుగానే ఉంది.

ముఖ్యంగా బెస్ట్ డైరెక్టర్ పురస్కారం రాజమౌళిని వరిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అకాడమీ అవార్డుల కంటే ముందే ఇచ్చే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఇప్పటికే ఎంపికయ్యాడు జక్కన్న. తాజాగా అతిరథ మహారథుల మధ్య ఆ పురస్కారాన్ని అందుకున్నాడు. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఈ వేడుకకు హాజరైన వేదిక మీద ఆసక్తికర ప్రసంగం చేశాడు జక్కన్న. అక్కడ ఆయన ఏమన్నాడంటే..

‘‘ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద నిలుచొని మాట్లాడడం కొంచెం కంగారుగా అనిపిస్తోంది. సినిమాను ఒక దేవాలయంగా భావిస్తాను. చిన్నపుడు థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లినపుడు పొందిన ఆనందం.. ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా.. ప్రతి సీన్‌ను చిత్రీకరించే ముందు ఈ సీన్ము థియేటర్లో ఎలా ఉంటుంది అని ఒక ప్రేక్షకుడిలా ఆలోచిస్తా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు తీస్తుంటా. కానీ ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో.. అదే అభిమానం, ఉత్సాహం విదేశీ ప్రేక్షకుల్లోనూ చూశా.

ఆర్ఆర్ఆర్ మీద విదేశీయులు సైతం అపరిమిత అభిమానం చూపించారు. న్యూయార్క్, చికాగో వెళ్లినపుడు థియేటర్లలో వారి ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశా. మామూలుగా సినిమా యూనిట్‌ను తమ కుటుంబం అంటుంటారు. కానీ నా విషయంలో ఇది కాస్త భిన్నం. నా కుటుంబ సభ్యులే యూనిట్ సభ్యులు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడానికి వాళ్లంతా కష్టపడుతుంటారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని జక్కన్న చెప్పాడు.

This post was last modified on January 5, 2023 7:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: RajamouliRRR

Recent Posts

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

15 minutes ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

32 minutes ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

37 minutes ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

57 minutes ago

దేవా కట్టాపై రాజమౌళి ప్రేమ,

దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…

2 hours ago

అశోక్‌కే చంద్ర‌బాబు మొగ్గు.. ఏం జ‌రుగుతోంది ..!

విజ‌య‌న‌గ‌రం మాజీ ఎంపీ పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్నారా?  ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ నాయ‌కుడైనప్ప‌టికీ..…

2 hours ago