విడుదలై ఏడాదికి దగ్గరగా ఉన్నా ఆర్ఆర్ఆర్ ప్రయాణం ఆస్కార్ గెలిచే దాకా ఆగేలా లేదు. తాజాగా రాజమౌళి న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఇచ్చిన ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నాక ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వణుకుతున్న నా కాళ్ళను కప్పిపెట్టేలా సాంప్రదాయ దుస్తులను తయారు చేసిన ఫ్యాషన్ డిజైనర్ కు థాంక్స్ చెబుతున్నానని ప్రసంగం మొదలుపెట్టిన జక్కన్న అవార్డు గెలవడం పట్ల తన సంతోషాన్ని చక్కగా వ్యక్తం చేశాడు. ఈ ఆనందం అభిమానులు ఫీలవుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరింత జోష్ ఇచ్చే మరో వార్త టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
యుఎస్ లో అత్యంత ఆదరణ కలిగిన మీడియా హౌస్ లో ఒకటైన వెరైటీ సంస్థ ప్రకటించే ముందస్తు అంచనాల జాబితాకు చాలా విలువుంటుంది. అధిక శాతం సందర్భాల్లో అవి నిజమయ్యాయి. తాజాగా బెస్ట్ యాక్టర్ గా అవకాశాలున్న టాప్ 10 లిస్టుని రిలీజ్ చేసింది. అందులో తారక్ పేరు ఉంది. మెహది బజేస్తాని, ఆస్టిన్ బట్లర్, ఎడెన్ డంబ్రైన్, కొలిన్ ఫరెల్, బ్రెండన్ ఫ్రెజర్ తొలి అయిదు స్థానాల్లో ఉండగా మిగిలిన వాటిలో యంగ్ టైగర్ కి చోటిచ్చారు. నెంబర్లు పక్కనపెడితే నటనలో ప్రామాణికత ఆధారంగా తయారు చేసే పేర్లు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా ఇది గొప్ప గుర్తింపు కిందే లెక్క.
నిజంగా ఆస్కార్ వరించినా వరించకపోయినా ఒక ఇండియన్ మూవీ ఇంత దూరం వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో కమల్ హాసన్, అమీర్ ఖాన్ లాంటి ఎందరో లెజెండ్స్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ ఇలా టాప్ టెన్ ప్రిడిక్షన్స్ లో చోటు దక్కించుకోలేకపోయారు. తారక్ కు ఆ అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 9న లాస్ ఏంజెల్స్ లో జరగబోయే ఐమాక్స్ స్పెషల్ ప్రీమియర్ కు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలు మళ్ళీ కలుసుకోబోతున్నారు. కేవలం 98 సెకండ్లలో 932 టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. అది కూడా తొమ్మిది నెలల పాత సినిమాకి. దటీజ్ జక్కన్న
This post was last modified on January 5, 2023 1:07 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…