మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టుకోవడం కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అనుమతులు సంపాదించారు టాలీవుడ్ పెద్దలు. సమావేశాలు, ప్రెస్ మీట్లతో హంగామా నడిచింది ఆ మధ్య. ఇంతా చేసి చివరికి అనుమతులు ఇస్తే.. టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా కూడా తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకోలేదు.
చిన్నా చితకా సినిమాలు కొన్ని ధైర్యం చేసి చిత్రీకరణ పునఃప్రారంభించాయి. కానీ మళ్లీ భయపడి వెనక్కి తగ్గాయి. టీవీ సీరియళ్ల షూటింగ్స్ చేయడం.. కొన్ని కరోనా కేసులు బయటపడటంతో భయపడి వాటికీ బ్రేక్ వేశారు.
హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతండటంతో నిర్మాతలు ధైర్యం చేస్తున్నా.. హీరోలైతే వద్దుబాబోయ్ అనేస్తున్నారని.. అందుకే షూటింగ్స్ పునఃప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. ఐతే మన హీరోలు ఇలా భయపడుతుంటే.. తెలుగు వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. వచ్చి హైదరాబాద్‌లో తన సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం. కొన్ని నెలల విరామం తర్వాత అతను మళ్లీ మేకప్ వేసుకున్నాడు.
తన కొత్త చిత్రం ఫాంటమ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెట్టాడు. రంగితరంగ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన అనూప్ బండారి ఈ చిత్రానికి దర్శకుడు. మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆ ఎగ్జైట్మెంట్‌తో ఒక చిన్న వీడియో కూడా వదిలాడు సుదీప్. మనవాళ్లు కరోనాకు భయపడుతుంటే.. ఓ కన్నడ హీరో ఇలా హైదరాబాద్ వచ్చి తన సినిమా షూటింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on July 20, 2020 11:19 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…