సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందుగా డబ్బింగ్ సినిమాల ట్రైలర్స్ ఒకటి తర్వాత మరొకటి రిలీజ్ అయ్యాయి. ఇటీవల ‘తెగింపు’ ట్రెయిలర్ వచ్చింది. అజిత్ ఈ ట్రైలర్ తో మంచి మార్కులు స్కోర్ చేసి ఎట్రాక్ట్ చేశాడు. ఈసారి విజయ్ వంతు. తాజాగా ‘వారసుడు’ ట్రెయిలర్ రిలీజైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్రైలర్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చేసింది.
ఇప్పటి వారసుడు మీద ఉన్న ఓ మోస్తారు అంచనాలు కూడా ట్రెయిలర్ తుడిచేసింది. వారసుడు కోసం వంశీ పైడిపల్లి తెలుగులో వచ్చిన ఫ్యామిలీ మిక్స్డ్ కమర్షియల్ స్టోరీనే తీసుకోవడం అందరినీ నిరాశ పరుస్తోంది. ఈ కోవలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఉమ్మడి కుటుంబం , సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఓ వ్యాపార సమస్య, హీరో ఫాదర్ కంపెనీ దక్కించుకునేందుకు చూసే స్టైలిష్ విలన్… ఫైనల్ గా హీరో విలన్ కి చెక్ పెట్టి మళ్లీ తన కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేయడం, ఇలా విజయ్ కోసం వంశీ పడిపల్లి ఓ రొటీన్ ఫార్ములా ఫ్యామిలీ కథే రాసుకోవడంతో నెటిజన్లు వారసుడు ట్రైలర్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు ఇదే కథతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ , రాం చరణ్, ఇలా స్టార్స్ అంతా తెలుగులో సినిమాలు చేసేశారు. మరి కోలీవుడ్ ఎంట్రీ కోసం వంశీ రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు చేసి కొన్ని మార్పులతో ఈ సినిమా తీశాడంటూ ట్రోలర్స్ వీడియో లతో ట్రోలింగ్ మొదలెట్టారు. అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, సరైనోడు, అల వైకుంఠ పురం, అజ్ఞాత వాసి , మహర్షి సినిమాల ఛాయలు వారసుడు లో గట్టిగా కనిపిసున్నాయి. మరి ఈ రొటీన్ కథతో వంశీ పైడిపల్లి తమిళ్, తెలుగు ప్రేక్షకులని సంక్రాంతి బరిలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
This post was last modified on January 4, 2023 9:48 pm
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో తెలిసిందే.ఆయన తీసుకుంటున్న దూకుడు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కుతున్న పటిస్ట భద్రతా…
పెద్ది టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతోంది. దీనికి ప్యారడైజ్ కి రిలీజ్ డేట్ల క్లాష్ గురించి…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవాలకు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్(అప్పటి…
డోలీ మోతలు... గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న…
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…