2021 దసరాకు ‘పెళ్ళిసంద-డి’ అనే చిన్న సినిమా రిలీజైంది. అందులోని కథాకథనాలు చూస్తే మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లి అప్పటి సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మరీ ముతకగా అనిపించే కథ.. ఔట్ డేటెడ్ నరేషన్‌తో సినిమా ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. ఐతే అలాంటి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. అందుకు ముఖ్య కారణం.. అందమైన యువ జంట.. ఆహ్లాదకరమైన పాటలు.. వాటి చిత్రీకరణ. హీరో హీరోయిన్లను చూడ్డానికే చాలా వరకు జనం థియేటర్లకు వెళ్లారు.
ఈ చిత్రంతోనే పూర్తి స్థాయి హీరోగా మారిన శ్రీకాంత్ కొడుకు రోషన్.. తెలుగులోకి అరంగేట్రం చేసిన కన్నడ కథానాయిక శ్రీలీల ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరికి మంచి భవిష్యత్తు ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంచనాలకు తగ్గట్లే శ్రీలీలకు తెలుగులో అవకాశాలు వరుస కట్టేశాయి. ఆల్రెడీ రవితేజతో ఆమె నటించిన ధమాకా రిలీజై సూపర్ హిట్ దిశగా అడుగులేస్తోంది. ఇందులో శ్రీలీల మరోసారి ప్రేక్షకులను తన అందం, డ్యాన్స్‌తో ఫిదా చేసేసింది.
తొలి సినిమాను మించి రెండో చిత్రం పెద్ద హిట్టవడంతో శ్రీలీల టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ స్టార్ హీరోయిన్‌గా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలయ్య సినిమాలో ముఖ్య పాత్ర చేస్తోంది. ఇంకో రెండు మూడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ‘పెళ్ళిసంద-డి’ హీరోయిన్ ఇలా దూసుకెళ్తుంటే.. హీరో రోషన్ మాత్రం ఏడాది తర్వాత కూడా అడ్రస్ లేడు.
హీరోయిన్ల మాదిరి హీరోలు గ్యాప్ లేకుండా, వరుసబెట్టి సినిమాలు చేసేయరన్నది వాస్తవమే. ‘పెళ్ళిసంద-డి’తో దక్కిన విజయాన్ని, పేరును నిలబెట్టుకుంటూ మంచి సినిమా చేయాలని, స్టార్‌గా ఎస్టాబ్లిష్ కావాలని రోషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తుండొచ్చు. కానీ ఇప్పటికీ తన తర్వాతి సినిమా ఏదో తేల్చుకోకపోవడం.. కొత్త సినిమా గురించి చిన్న హింట్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. మరీ ఇంత గ్యాప్ వస్తే జనాలు కుర్రాడిని మరిచిపోతారు. ‘పెళ్ళిసంద-డి’తో వచ్చిన ఊపు కంటిన్యూ అవ్వదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా రోషన్ కొత్త సినిమాను ఓకే చేసి పట్టాలెక్కించాల్సిన బాధ్యత అతడి తండ్రి శ్రీకాంత్‌దే.
This post was last modified on January 4, 2023 2:25 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…