తన తోటి స్టార్ హీరోయిన్ అయిన సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్నా. అనారోగ్యంతో బాధ పడుతున్న సమంతకు అమ్మలా మారి కాపాడుకోవాలని ఉందని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. సమంత ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే స్త్రీ మూర్తి అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించింది రష్మిక.
తన కొత్త చిత్రం వారసుడు ప్రమోషన్లలో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. సమంత మయోసైటిస్ అనే వ్యాధిక గురైన విషయం ఆమె ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని రష్మిక వెల్లడించింది. సమంత తనకు మంచి స్నేహితురాలే అయినప్పటికీ.. గతంలో మయోసైటిస్ గురించి తమ మధ్యన ఎప్పుడూ ప్రస్తావన కూడా రాలేదని వివరించింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనుకుంటున్నానని, ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది. తాను ఎంతగానో ఇష్టపడే సమంతకు ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని తెలిపింది.
మరోవైపు తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా తరచుగా ప్రచారంలో ఉండే విజయ్ దేవరకొండ గురించి రష్మిక మాట్లాడింది. తమ కలయికలో మరో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తన్నారని.. వాళ్ల కోరికను మన్నిస్తూ మళ్లీ తాము సినిమా చేస్తామని రష్మిక తెలిపింది. విజయ్ వర్క్ తనకెంతో ఇష్టమని.. అతడితో పని చేయడాన్ని ఆస్వాదిస్తానని ఆమె అంది. మంచి కథ కుదరాలని.. అది జరిగినపుడు మళ్లీ తమ కలయికలో సినిమా వస్తుందని ఆమె చెప్పింది.
This post was last modified on January 4, 2023 6:09 am
తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్…
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బోర్లా పడుతోందనే విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్లో…
వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటుగా ఆ పార్టీ పేరు చెప్పుకుని చాలా మంది…
దేనికైనా టైమింగ్, ప్లానింగ్ ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి. నిన్నపెద్ది టీజర్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు,…
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ…