నాని అభిమానులకి మాస్ జ్ఞాపకం

ఈ మధ్య స్టార్ హీరోలు తమ అభిమానుల కోసం ఫ్యాన్స్ మీట్ పెట్టుకోవడం , వారికి ఫోటో ఘాట్ ఇవ్వడం షరా మామూలే. ధమాకా రిలీజ్ కి ముందు రవితేజ కూడా అభిమానుల కోసం ఫోటో ఘాట్ ఏర్పాటు చేశాడు. ఆ ఫ్యాన్స్ మీట్ రవితేజకి కలిసొచ్చింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఫ్యాన్ మీట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా ఫోటో ఘాట్ ఏర్పాటు చేసి అభిమానులకి ఫోటోస్ ఇచ్చాడు.

ఈ ఫోటో ఘాట్ కోసం నాని ‘దసరా’ గెటప్ లో విచ్చేశాడు. పంచే , కలర్ షర్ట్ , లాంగ్ హెయిర్ తో ఫ్యాన్స్ కి మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు. అయితే నాని ఉన్నపాలంగా ఫ్యాన్స్ కి ఈ లుక్ తో ఫోటోస్ ఇవ్వడానికి రీజన్ ఉంది. తాజాగా దసరా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే గెటప్ మార్చేసి మళ్ళీ మునపటి లుక్ లోకి వచ్చేయనున్నాడు నాని. శౌర్య అనే దర్శకుడితో చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ క్లాస్ లుక్ లోకి రానున్నాడు.

దసరా గెటప్ తీసేసే ముందు ఆ లుక్ తో ఫ్యాన్స్ కి ఓ జ్ఞాపకం ఇవ్వాలని ఫిక్సయ్యాడు నేచురల్ స్టార్. అందుకే దసరా గెటప్ తో ఫోటో ఘాట్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఫ్యాన్స్ తో నాని దసరా గెటప్ ఫోటో ఘాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వెనుక సిల్క్ స్మిత ఇమేజ్ తో నాని ఫోటో ఘాట్ జరుగుతుంది. దసరా రిలీజ్ రోజు మాస్ గెటప్ తో సింగిల్ స్క్రీన్ లో నాని ఫ్యాన్స్ ఫ్లెక్సీల హడావుడికి కూడా ఈ ఫోటో ఘాట్ కొంత కారణం అనుకోవచ్చు.