సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడం అంటే ఒక దర్శకుడికి పెద్ద అచీవ్మెంట్ అన్నట్లే. టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్లలో ఒకడైన మహేష్‌తో సినిమా చేసే అవకాశం రావడం చిన్న విషయం కాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ల కెరీర్ మరో లెవెల్‌కు వెళ్లిపోతుంది. ఐతే అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని దర్శకుడు పరశురామ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా మిడ్ రేంజ్ స్టార్లు అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించగా.. వారిలోంచి నాగచైతన్యను ఎంచుకున్నాడు. వీరి కలయికలో సినిమాకు అడుగులు పడుతున్న సమయంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ నుంచి పిలుపు వచ్చింది పరశురామ్‌కు. చైతూ సినిమాను పక్కన పెట్టి మరీ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు పరశురామ్. కానీ వీరి కలయికలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ అంచనాలను అందుకోలేకపోయింది.
‘సర్కారు వారి పాట’ హిట్ అయి ఉంటే.. ఇంకో టాప్ స్టార్‌తో పరశురామ్‌కు అవకాశం దక్కేదే. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ముందు అనుకున్న నాగచైతన్య సినిమా కూడా ముందుకు కదల్లేదు. కొన్ని నెలల పాటు ఈ సినిమా మీద పని చేసిన పరశురామ్.. చైతూను మెప్పించలేకపోవడంతో ప్రాజెక్టును డ్రాప్ చేయక తప్పట్లేదట. ఈ సినిమాను నిర్మించాల్సిన 14 రీల్స్ ప్లస్ వాళ్లు కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఆ మధ్య ఒక వేడుకలో భాగంగా బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు పరశురామ్. కానీ అది మాటలకే పరిమితం అయింది. బాలయ్య కూడా అంత ఖాళీగా ఏమీ లేడు. మొత్తానికి ఇటు పెద్ద స్టార్లూ సెట్ కాక.. మిడ్ రేంజ్ హీరోలతోనూ సినిమా కుదరక.. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు పరశురామ్. ‘సర్కారు వారి పాట’ రిలీజయ్యాక ఏడాది వ్యవధిలో అతడి కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదికి వెళ్లే సంకేతాలు కనిపించడం లేదు. అంత పెద్ద స్టార్‌తో సినిమా చేశాక పరశురామ్‌కు ఈ పరిస్థితి రావడమేంటో?
This post was last modified on January 3, 2023 4:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…