సంక్రాంతి సినిమాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బడా సినిమాలు థియేటర్స్ లోకి రావడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమాలకు సంబంధించి రోజులు లెక్క పెట్టడం మొదలెట్టేశారు. ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ చూస్తే అక్కడ చిరంజీవి పై బాలయ్యే పై చేయి సాదించే అవకాశం కనిపిస్తుంది.
వరుసగా సాంగ్స్ రిలీజ్ , కాస్టింగ్ ఇంటర్వ్యూ లతో రెండు సినిమాలకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో జనవరి 6న గ్రాండ్ గా చేయబోతున్నారు. అక్కడ భారీ వేదిక రెడీ అవుతుంది, అలాగే ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న వైజాగ్ లో భారీ ఎత్తున చేయబోతున్నారు.
ఇక కోలీవుడ్ లో కూడా తునివు , వరిసు సినిమాల సందడి మొదలయింది. అక్కడ కూడా ఫ్యాన్స్ ఈ సినిమాల గురించే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సంక్రాంతి సినిమాల హడావుడి మొదలవ్వడంతో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు సినిమాలు చూద్దామా ? అంటూ థియేటర్స్ వైపు చూస్తున్నారు. ఈసారి టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర ఎవరు బిగ్గెస్ట్ హిట్ కొడతారా ? అంటూ హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. మరి 2023 సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
This post was last modified on January 3, 2023 12:57 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…