టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి తెలియంది కాదు. తమన్ రెమ్యునరేషన్ ని చిన్న నిర్మాతలు భరించలేరు. టాప్ ప్రొడ్యూసర్లకు డేట్లు ఇవ్వడానికే మహా కష్టమైపోయి ఒక్కోసారి పెద్ద హీరోలకు కూడా యావరేజ్ ఆల్బమ్స్ పడుతున్నాయి. క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాల్లో సగం తన చేతిలోనే ఉన్నాయి. ఈ సంక్రాంతికే రెండు బడా రిలీజులు రెడీ అయ్యాయి.
ఇక దేవిశ్రీ ప్రసాద్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన డిమాండ్ ప్రకారమే పారితోషికం తీసుకుంటున్నాడు. తాజాగా వాల్తేరు వీరయ్య పాటలు క్లిక్ అయ్యాక ఇక తగ్గేదేలే అనడం సహజం. పైగా పుష్ప 2 మీద ఓ రేంజ్ హైప్ ఉంది.
ఇక అనూప్ రూబెన్స్, మిక్కీ జె మేయర్ లాంటి వాళ్ళ గ్రాఫ్ ఒకసారి పైకి మూడుసార్లు కిందికి అన్నట్టు ఎగుడుదిగుడుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల అవసరం చాలా ఉంది. పక్కన అనిరుద్ రవిచందర్ భీభత్సమైన ఫామ్ లో ఉన్నా మనవాళ్లకు చిక్కడం లేదు. త్రివిక్రమ్ పట్టుకొచ్చి అజ్ఞాతవాసి ఇస్తే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది.
నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ కి కోరిమరీ పిలిపించుకున్నాడు. నిరాశ పరచలేదు కానీ పది కాలాల పాటు నిలిచిపోయే సాంగ్స్ అయితే రాలేదు. అందుకే అర్జెంట్ గా ఇంకొన్ని యంగ్ టాలెంట్స్ కావాలి. ఇప్పుడా స్థానంలో హేషం అబ్దుల్ వహాబ్ కనిపిస్తున్నాడు.
మలయాళంలో హృదయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఇతనికి టాలీవుడ్ డెబ్యూ విజయ దేవరకొండ ఖుషితో దక్కింది. అది లేట్ అవుతోంది కానీ ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడనే టాక్ ఉంది. తాజాగా నాని 30 ఆఫర్ వచ్చింది. ఇదీ ఎమోషనల్ జర్నీనే. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ దట్టించినట్టు కాన్సెప్ట్ లాంచ్ వీడియోలో చెప్పేశారు.
ఇవి కనక సరిగ్గా క్లిక్ అయితే అబ్దుల్ వహాబ్ పంట పండినట్టే. కాకపోతే హరీష్ జైరాజ్, యువన్ శంకర్ రాజా, గోపి సుందర్ లాగా ఏదో రెండు మూడేళ్లు తాత్కాలికంగా పద్ధతిలో కాక ఇక్కడే స్థిరపడితే ఓ కొరత తీరిపోతుంది. ఇతననే కాదు రెహమాన్ లాంటి ప్రభంజనాలు ఇండస్ట్రీకి ఇంకా రావాలి
This post was last modified on January 3, 2023 6:09 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…