‘ధమాకా’ సినిమాకు వచ్చిన టాక్‌కు, అది సాధిస్తున్న వసూళ్లకు అసలు పొంతన ఉండడం లేదు. తొలి రోజు నుంచే క్రిటిక్స్, ట్రేడ్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఆ చిత్రం.. వీకెండ్ తర్వాత కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. మంచి ఆక్యుపెన్సీతో బండి నడిపించిన రవితేజ సినిమా.. రెండో వీకెండ్ వచ్చేసరికి మళ్లీ ఆధిపత్యం చలాయించింది.
గత వారాంతంలో చెప్పుకోగ్గ కొత్త చిత్రాలేమే రాకపోవడంతో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘ధమాకా’నే అయింది. ముఖ్యంగా ఆదివారం ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండిట్లను విస్మయానికి గురి చేశాయి. జనవరి 1న సంబరాల్లో భాగంగా తెలుగు జనాలు ‘ధమాకా’ థియేటర్లకు పోటెత్తారు. రిలీజైన 10వ రోజు ఈ చిత్రానికి రూ.3.5 కోట్లకు పైగా షేర్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రాజమౌళి సినిమాలైన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల తర్వాత పదో రోజు అత్యధిక షేర్ రాబట్టిన చిత్రం ఇదేనట. డివైడ్ టాక్ తెచ్చుకున్న మామూలు మాస్ సినిమా.. పదో రోజు నాన్-రాజమౌళి రికార్డు నెలకొల్పడం అంటే మాటలు కాదు. సినిమా కొత్తగా రిలీజైన తరహాలో నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ‘ధమాకా’ థియేటర్లు జనాలు, సంబరాలతో షేకైపోయాయి.
రవితేజ సినిమాకు థియేటర్లలో ఈ స్థాయిలో సంబరాలు జరిగి చాలా కాలం అయిపోయింది. ఈ చిత్రంలోని మాస్ పాటలకు థియేటర్లు ఊగిపోతున్నాయి. మాస్ సినిమాలు జనాలకు నచ్చితే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ‘ధమాకా’ రుజువుగా నిలుస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.65 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేసింది. షేర్ రూ.35 కోట్ల మార్కును దాటేసింది. సినిమా మీద బయ్యర్ల పెట్టుబడి మీద ఇప్పటికే ఐదారు కోట్ల లాభాలు వచ్చేశాయి.
This post was last modified on January 2, 2023 9:35 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…