జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతున్నా ఓపిగ్గా ఉంటున్నారు. ఐతే వారికి ఉత్సాహాన్నిస్తూ ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని, 2024 ఏప్రిల్ 5న సినిమా రిలీజవుతుందని తాజాగా ప్రకటన విడుదల చేసింది చిత్ర బృందం.
ఇంకా షూటింగ్ మొదలవకముందే రిలీజ్ డేట్ ప్రకటించడం ఏంటని ఆశ్చర్యం కలిగినా.. పాన్ ఇండియా స్థాయలో రిలీజయ్యే ఈ చిత్రానికి ముందే డేట్ ఇవ్వడం ద్వారా ఇంకెవరూ కర్చీఫ్ వేయకుండా చూసుకోవాలని చిత్ర బృందం భావించినట్లుంది. రిలీజ్ డేట్ విషయంలో కొరటాల అండ్ టీం ప్లానింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారిప్పుడు. ఎన్టీఆర్ చాలా మంచి డేటే పట్టేశాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏప్రిల్ 5 శుక్రవారం కాగా.. ఆ వీకెండ్లో సినిమా జోరు చూపించడం ఖాయం. ఇక 9న ఉగాది పండుగ వస్తోంది. కాబట్టి ఆ రోజు సెలవు బాగా కలిసి వస్తుంది. తర్వాత 11వ తారీఖు రంజాన్ సెలవు ఉంది. కాబట్టి ఆ రోజూ సినిమా సందడి కొనసాగే అవకాశముంది. సినిమాకు మంచి టాక్ వచ్చి ఎక్కువ రోజులు నిలబడేట్లయితే.. తర్వాత కూడా కలిసి మరో సెలవు కలిసి వస్తుంది. 17న శ్రీరామ నవమి కావడంతో రెండో వారంలో కూడా సినిమాకు అడ్వాంటేజ్ దక్కనున్నట్లే.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి.. బాలీవుడ్లో భారీ చిత్రాలేవీ లేకపోయి, తన సినిమాకు మంచి టాక్ తెచ్చుకున్నాడంటే వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తి చేసి.. ఆ తర్వాత నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ చిత్రానికి జాన్వి కపూర్‌ను కథానాయికగా ఎంచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on January 2, 2023 2:07 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…