ఏడాదికి ఎన్ని సినిమాలొచ్చినా తమ అభిమాన హీరో నుండి ఓ సినిమా రాలేదనే వెలితి ఫ్యాన్స్ లో ఉంటుంది. గతేడాది అల్లు అర్జున్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. సుకుమార్ ‘పుష్ప 2’ తో బన్నీ ని మరో సినిమా చేయకుండా సంవత్సరం పైనే బ్లాక్ చేసేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి లాస్ట్ ఇయర్ నిరాశే మిగిలింది. ఇక ఈ ఇయర్ లో అయినా పుష్ప 2 థియేటర్స్ లోకి వస్తుందా ? అంటే చెప్పలేని పరిస్థితి. షూటింగ్ నత్త నడకన సాగడమే అందరికీ సందేహం కలిగిస్తుంది.
ఇక తాజాగా ఎన్టీయార్ ను కూడా కొరటాల శివ ఏడాది పాటు మరో సినిమా చేయకుండా బ్లాక్ చేసేశాడు. #NTR30 సినిమా 2023 లో రావడం లేదని తాజా ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో యన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఇయర్ తమ హీరో సినిమా రాదని తెలిసి నిరాశ చెందుతున్నారు. పోనీయ్ 2024 సంక్రాంతి కానుకగా అని ప్రకటించినా వారు సంతోష పడేవారేమో కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ అని తెలిశాక తీవ్ర నిరాశకి లోనవుతున్నారు. కొందరు అభిమనులైతే అన్నీ నెలలు ఏం తీస్తావ్ అంటూ కోపంతో కొరటాలను సోషల్ మీడియాలో నేరుగా ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ‘ ఆచార్య’ తర్వాత కొరటాల ఎన్టీఆర్ సినిమా కోసం చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. అన్నీ ఆచి తూచి ప్లాన్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు పెట్టి ఎక్కువ రోజులు తీయబోతున్నాడు. అల్లు అర్జున్ నుండి ఒక ఏడాది సుకుమార్ లాగేసుకొని అభిమనులని నిరాశ పరిస్తే ఇప్పుడు సుక్కు రూట్లోనే ఎన్టీఆర్ ను బ్లాక్ చేసి తారక్ ఫ్యాన్స్ ను న్యూ ఇయర్ రోజు డిసప్పాయింట్ చేశాడు కొరటాల. ఏదేమైనా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలకు ఇంత టైమ్ తీసుకుంటే ఎలా మరి సుక్కు , కొరటాల ఆలోచించాల్సిందే .
This post was last modified on January 1, 2023 12:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…