కథనాయికగా అవకాశాలు తగ్గిపోయినప్పటికీ.. ఓవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. మరోవైపు టీవీ షోల్లో సందడి చేస్తూ యాక్టివ్‌గానే ఉంటూ వచ్చింది ‘అవును’ భామ పూర్ణ. ఈ ఏడాదే ఆమె షానిద్ అసిఫ్ అలీ అనే దుబాయి కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం.. రెండు నెలల కిందటే అతణ్ని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనడం అరుదు.
కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత శుభవార్త చెబుతుంటారు. కానీ పూర్ణ మాత్రం అలా ఆలస్యం చేయలేదు. పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెెప్పేసింది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఒక వీడియో ద్వారా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. అక్టోబరు 25న పెళ్లి చేసుకున్న పూర్ణ.. 9 వారాల్లోనే తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించడంతో ఆమె మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 33 ఏళ్ల పూర్ణ అసలు పేరు షమ్మా ఖాసిమ్.
పూర్ణ అనే పేరు చూసి ఆమె హిందూ అమ్మాయి అనుకుంటారు కానీ.. తను ముస్లిం. చాలామందికి పెళ్లి టైంలో కానీ ఈ విషయం తెలియలేదు. ఈ మలయాళీ భామ శ్రీహరి ప్రధాన పాత్ర పోషించిన ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘అవును’ పెద్ద హిట్టయి తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును-2, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు లాంటి సినిమాల్లో ఆమె నటించింది. కథానాయికగా అవకాశాలు తగ్గిపోయాక క్యారెక్గర్ రోల్స్‌లోనూ మెరుస్తోంది పూర్ణ. ఇటీవల ‘అఖండ’ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసింది. ఆమె అనేక టీవీ షోల్లోనూ తరచుగా కనిపిస్తోంది. ఆమె భర్త అసిఫ్ అలీ యూఏకీకి చెందిన వ్యాపారవేత్త.
This post was last modified on December 31, 2022 7:59 pm
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…