Movie News

అక్కడ చిరుపై బాలయ్యదే ఆధిపత్యం

సినిమాల బడ్జెట్, వసూళ్లు, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇలా ఏ విషయంలో చూసినా నందమూరి బాలకృష్ణ కంటే మెగాస్టార్ చిరంజీవి కొన్ని మెట్లు పైనే ఉంటాడు. బాలయ్య కెరీర్లో కూడా కొన్ని ఆల్ టైం హిట్లు ఉండొచ్చు. కొన్నిసార్లు చిరును ఢీకొట్టి పైచేయి సాధించి ఉండొచ్చు.. అయినా సరే.. ఈ ఇద్దరిలో ఓవరాల్ ఆధిపత్యం మాత్రం చిరుదే.

2001లో మృగరాజుకు బ్యాడ్ టాక్ రావడం వల్ల నరసింహనాయుడు పైచేయి సాధించి ఉండొచ్చు కానీ.. 2017లో మాత్రం అలా జరగలేదు. ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బాలయ్య సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని మించి చిరు మూవీ ‘ఖైదీ నంబర్ 150’దే ఆధిపత్యం అయింది. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’తోనూ చిరు.. బాలయ్య మూవీ ‘వీరసింహారెడ్డి’ని అధిగమిస్తాడా అని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈసారి ఓవరాల్ బజ్ చిరు సినిమాకే ఎక్కువ కనిపిస్తోంది.

కానీ ఈ ప్రభావం యుఎస్ మార్కెట్లో అయితే ప్రతిఫలించడం లేదు. చిరు సినిమా కంటే బాలయ్య మూవీకే అక్కడ ఎక్కువ స్పందన కనిపిస్తోంది. శుక్రవారం ఉదయానికి ప్రి సేల్స్ చూస్తే ఈ సంగతి అర్థమవుతోంది. యుఎస్‌లో ‘వీరసింహారెడ్డి’ 61 లొకేషన్లలో 132 ప్రిమియర్ షోలు వేస్తుండగా.. ఇప్పటిదాకా ప్రి సేల్స్‌తో 40 వేల డాలర్లు వసూలయ్యాయి.

అమ్ముడైన టికెట్ల సంఖ్య 2264. ఐతే అదే సమయానికి చిరు సినిమాకు ప్రి సేల్స్ ద్వారా 27 వేల డాలర్లే వచ్చాయి. ఆ సినిమా టికెట్లు 1483 అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి 54 లొకేషన్లలో 114 ప్రిమియర్ షోలు పడుతున్నాయి.

చిరు, బాలయ్య సినిమాల మధ్య లొకేషన్లు, షోలు, ప్రి సేల్స్‌లో ఈ అంతరం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఈ మధ్య టీడీపీ కేడర్, కమ్మ కమ్యూనిటీ మంచి ఉత్సాహంతో ఉన్నాయి యుఎస్‌లో. ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ టైంలో కూడా మంచి ఊపు చూపించారు. అదే ఉత్సాహాన్ని బాలయ్య కొత్త సినిమాకు కూడా చూపిస్తున్నారనే చర్చ నడుస్తోంది.

This post was last modified on December 31, 2022 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

3 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

8 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

12 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

13 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

14 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

15 hours ago