Movie News

Dil Raju హర్టయినట్లే..

టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా.. నైజాం ఏరియా హక్కులు దక్కించుకోవడానికి ముందుండేది దిల్ రాజే. ఓవైపు ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నా, పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్నా సరే.. డిస్ట్రిబ్యూషన్ వదిలేయకుండా ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు Dil Raju.

నైజాంలో థియేటర్ల మీద, అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద తిరుగులేని పట్టున్న రాజు.. పెద్ద సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి తన సంస్థ ద్వారా రిలీజ్ చేస్తుంటారు. టాలీవుడ్లో కొన్ని పెద్ద బేనర్లు సొంతంగా నైజాంలో తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నా సరే.. రాజు సహకారం లేకుండా పని సాఫీగా నడవదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.

ఐతే సంస్థ మొదలైన దగ్గర్నుంచి తమ చిత్రాలను Dil Raju కే ఇస్తూ వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. ఇప్పుడు సొంతంగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసుకుని సంక్రాంతికి తమ సంస్థ నుంచి వస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దాన్నుంచే రిలీజ్ చేయడానికి సిద్ధం కావడం రాజుకు పెద్ద షాక్ అన్న చర్చ నడుస్తోంది.

ఈ విషయమై రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైత్రీ వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుని, ఈ బిజినెస్‌లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే అంటూనే.. ఈ విషయంలో తాను హర్టయినట్లు చెప్పకనే చెప్పేశారు రాజు. మైత్రీ సంస్థ తొలి చిత్రాన్ని మినహాయిస్తే ప్రతి సినిమానూ తానే నైజాంలో రిలీజ్ చేశానని.. వాళ్లకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చానని.. ‘ఉప్పెన’ సినిమా విషయంలో చిన్న ఇబ్బంది తలెత్తినా సరే.. ఆ తర్వాత కూడా తనకే ఆ సంస్థ మూడు చిత్రాలను ఇచ్చారని రాజు గుర్తు చేశాడు. నిజంగా తనతో ఏదైనా ఇబ్బంది ఉంటే ‘ఉప్పెన’ తర్వాత తనకు సినిమా ఇచ్చేవారు కాదు కదా అని రాజు అన్నాడు.

మైత్రీ వాళ్లు కేవలం ఇప్పుడు రిలీజ్ చేస్తున్న రెండు సినిమాలతో అంతా అయిపోదని.. రెండేళ్ల తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే తమ నిర్ణయం కరెక్టా కాదా అన్నది అర్థమవుతుందని.. అప్పుడు దిల్ రాజు, శిరీష్‌ల వర్త్ ఏంటో తెలుస్తుందని.. తమ సంస్థ ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తే పని ఎంత సాఫీగా సాగుతుందో.. ఎంత రెవెన్యూ వస్తుందో అర్థమవుతుందని రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే తాను ఇంత కాలం ఎంతో సహకరించినా.. తనను నమ్మకుండా కొత్తగా మైత్రీ వాళ్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం రాజును కొంత బాధించినట్లే కనిపిస్తోంది.

This post was last modified on December 29, 2022 9:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నగారు తప్పుకోవడమే మంచిదయ్యింది

తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…

37 minutes ago

భర్త కోసం చైన్ స్నాచర్ గా మారిన భార్య!

తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…

3 hours ago

థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…

3 hours ago

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…

5 hours ago

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…

6 hours ago

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

7 hours ago