Movie News

మహేష్ అలక, నిఖిల్ కన్నీళ్లపై దిల్ రాజు..

ఈ మధ్య టాలీవుడ్లో హీరోలను మించి వార్తల్లో నిలుస్తున్నాడు దిల్ రాజు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినా.. బయట స్టేజ్ ఎక్కి ఏదైనా కామెంట్ చేసినా.. వైరల్ అయిపోతున్నాయి. అలాగే ఆయన చర్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. గత కొన్ని నెలల్లో రాజు చుట్టూ ముసురుకున్న వివాదాలు కూడా తక్కువ కాదు.

ఈ ఏడాది వేసవిలో రిలీజైన మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ను దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయగా.. ఈ సినిమా వసూళ్ల గురించి ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లుగా తాము నిర్మాతలకు ఇచ్చే వసూళ్ల లెక్కలు వేరని.. వాళ్లు ప్రకటించేవి వేరని ఆయన వ్యాఖ్యానించడం చిన్న దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యల విషయంలో మహేష్ బాబు ఫీలయ్యాడని.. తన తర్వాతి చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకు ఇవ్వొద్దని హారిక హాసిని క్రియేషన్స్ వాళ్లకు చెప్పాడని గుసగుసలు వినిపించాయి.

ఈ ప్రచారంపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. మహేష్ బాబు చాలా సెన్సిటివ్ అని.. ఎవరో ఏదో చెబితే నమ్మేసి ఆ సమయానికి కోపగించుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని.. కానీ తర్వాత ఏది కరెక్టో అదే చేస్తాడని.. ఏదైనా విషయమై క్లారిటీ ఇస్తే అర్థం చేసుకుంటాడని రాజు పేర్కొన్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు తాను ఫ్యాన్సీ రేటు ఇస్తే నిర్మాతలు హక్కులు ఇవ్వకుండా ఉంటారా.. తాను ఒక వేళ ఆ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తే ఏమంటారు అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. పరోక్షంగా తన వ్యాఖ్యల విషయంలో మహేష్ ఫీలైన విషయాన్ని అంగీకరించాడు రాజు.

ఇక తన ‘కార్తికేయ-2’ చిత్రం రిలీజ్ డేట్ మార్పించారంటూ ఓ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడంపైనా రాజు స్పందించాడు. అప్పుడు అందరూ తన వైపే వేలు చూపించారని.. ఐతే నిఖిల్‌ను పక్కన పెట్టుకుని ‘కార్తికేయ-2’ సక్సెస్ మీట్లో దీనిపై తాను వివరణ ఇచ్చానని.. తాను ఏ సినిమానూ దెబ్బ తీయాలని కోరుకోనని రాజు చెప్పాడు. ఆగస్టు తొలి వారంలో మూడు సినిమాలు వస్తే ఇబ్బందని.. ఒక సినిమాను వాయిదా వేసుకుంటే మంచిదని ముగ్గురు నిర్మాతలకూ తాను చెప్పానని.. చివరికి నిఖిల్ సినిమా నిర్మాతలే వెనక్కి తగ్గారని రాజు తెలిపాడు. ఇక ఆగస్టు 22 నుంచి కార్తికేయ-2 వెనక్కి వెళ్లడం గురించి చెబుతూ.. తన ‘థ్యాంక్యూ’ సినిమా ఓవర్ బడ్జెట్ అయిందని.. కాబట్టి పోటీ లేకుండా ‘కార్తికేయ-2’ను వాయిదా వేయించాలని తాను రిక్వెస్ట్ చేశాను తప్ప బలవంతంగా ఆ సినిమా డేట్ మార్పించలేదని రాజు తేల్చేశాడు.

This post was last modified on December 29, 2022 5:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

18 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

28 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

56 minutes ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

5 hours ago