Movie News

‘ఏజెంట్’ అలా ఫిక్సయ్యాడు

అక్కినేని అభిమానుల చూపంతా ఇప్పుడు ‘ఏజెంట్’ మీదే ఉంది. భారీ అంచనాల మధ్య ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి.. వరుసగా మూడు ఎదురు దెబ్బలు తిన్న అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో తొలి విజయాన్నందుకుని.. ఆ తర్వాత చేస్తున్న భారీ చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో అఖిల్ అసలు సత్తా చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కావడం.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లకు పేరుపడ్డ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ ఏడాదే ‘ఏజెంట్’ థియేటర్లలోకి దిగాల్సింది.

ముందు ఆగస్టులో రిలీజ్ అన్నారు. తర్వాత క్రిస్మస్ రిలీజ్ అన్న చర్చ నడిచింది. ఆపై 2023 సంక్రాంతికి షెడ్యూల్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ డేట్లను సినిమా అందుకోలేకపోయింది. చివరికి ఇప్పుడు ఆ సినిమాను ఫిబ్రవరి రిలీజ్‌కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఒక దశలో వేసవి విడుదల గురించి కూడా ఆలోచించారట కానీ.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం కావడం, వేసవికి తీవ్రమైన పోటీ ఉండడంతో ఫిబ్రవరి రిలీజ్‌కు ముహూర్తం చూసేశారట. ఆ నెల మూడో వారంలో ‘ఏజెంట్’ రిలీజయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. నూతన సంవత్సర కానుకగా ఒక స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న ‘ఏజెంట్’ టీం.. అందులోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తుందని సమాచారం.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మోడల్ సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత వక్కంతం వంశీ కథతో సురేందర్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఇందులో విలన్ల మీద చాలా వైల్డ్‌గా రైడ్ చేసే సీక్రెట్ ఏజెంట్ పాత్ర చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అన్న సంకేతాలు కనిపించాయి.

This post was last modified on December 29, 2022 4:17 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

45 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago