పది రోజుల క్రితం హఠాత్తుగా ఊడిపడినట్టు ఇచ్చిన ఖుషి రీ రిలీజ్ ప్రకటన అంచనాలకు మించి రచ్చే చేసేలా ఉంది. ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తాలూకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. నిజానికి ఈ ట్రెండ్ బాగా డౌన్ అయ్యిందని ఇటీవలే వచ్చిన కొన్ని పాత సినిమాలు భయపెట్టాయి. వర్షం, బాద్షా, మాయాబజార్,ప్రేమదేశం తదితరాలకు పెద్ద స్పందన రాలేదు. చాలా చోట్ల కనీసం థియేటర్ రెంట్లు కిట్టుబాటు కాక రద్దయిన షోలు ఉన్నాయి. సహజంగానే రెండు నెలల క్రితం తమ్ముడు, జల్సాలను చూసిన ఫ్యాన్స్ Kushiని ఏ మాత్రం చూస్తారోననే సందేహం వచ్చింది.
కానీ వాటిని పటాపంచలు చేస్తూ ఖుషి టికెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో ఏడెనిమిది షోలు వేసినా ఈజీగా హౌస్ ఫుల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇయర్ ఎండింగ్ ని పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ తో సెలెబ్రేట్ చేసుకోవాలని అభిమానులు గట్టిగా ఫిక్స్ కావడంతో ఈ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఓటిటిలోనే కాదు ఖుషి యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. అలాంటిది ఈ స్థాయిలో చూడాలనుకోవడం ఆశ్చర్యమే. అయితే ఓవర్సీస్ లో మాత్రం సింగల్ థియేటర్లు తప్ప కార్పొరేట్ చైన్లు దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.
కొన్ని చోట్ల Pawan ఫ్యాన్స్ అల్లరికి ఎగ్జిబిటర్లు జంకుతుండగా అభిమాన సంఘాలు హామీగా ఉండి షోలు వేయిస్తున్నాయి. మొత్తానికి తక్కువ టైంలో అయినా నిర్మాత ఏఎం రత్నంకు మంచి ఫలితమే వచ్చేలా ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఖుషి నిజంగా స్క్రీన్ మీద చూడాల్సిన లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్, పవన్ భూమికల నటన, మణిశర్మ పాటలు ప్లస్ బీజీఎమ్, కామెడీ, యాక్షన్ దేనికవే సినిమా ప్రేమికులను ఉర్రూతలూపాయి. మరి ఇంత గ్యాప్ తర్వాత వస్తున్న సిద్దు సిద్దార్థ్ రాయ్ సంవత్సరం చివర్లో ఎంత రచ్చ చేస్తాడో.
This post was last modified on December 28, 2022 1:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…