టాలీవుడ్లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ గుర్తుందా? జూనియర్ ఐశ్వర్యారాయ్‌గా గుర్తింపు పొందిన ఈ నీలికళ్ల సుందరి.. చాన్నాళ్ల నుంచి అస్సలు వార్తల్లో లేదు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌గానే ఉంటోంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదో ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కిచెన్ దగ్గర చెఫ్‌లందరూ పక్కన ఉండగా ఆమె దోసె పోసే ప్రయత్నం చేసింది. ఈ పనిలో ఆమెకు అస్సలు ప్రవేశం లేదని.. గరిట పట్టుకోగానే అర్థం అయిపోయింది.
గరిటలో పిండి తీసుకుని.. పెనం మీద ఇష్టం వచ్చినట్లు పోస్తూ వెళ్లింది స్నేహ. పిండిని మధ్యలో పోసి చాలా సింపుల్‌గా తిప్పుతూ వెళ్తే దోసె షేప్ వచ్చేస్తుంది. కానీ స్నేహకు ఈ సింపుల్ టెక్నికల్ తెలియక పలక మీద బలపంతో గీసినట్లు.. పెనం మీద గరిటతో ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ వెళ్లింది. చివరికది విచిత్రమైన షేప్‌లోకి వచ్చింది. మానవ మాత్రుడెవడూ దాన్ని దోసె అని భావించే అవకాశమే లేదు. ఈ వీడియో చూసి ఈ అమ్మాయికి కనీసం దోసె పోయడం కూడా రాదంటే వంట గది వైపే అడుగు వేయదేమో అని కామెంట్లు చేస్తున్నారు.
ఐతే తానెంత పేలవంగా దోసె పోసినప్పటికీ.. ఆ వీడియోను స్నేహ ఇలా షేర్ చేసుకోవడం విశేషమే. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ అనే హిట్ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన స్నేహ.. ఆ తర్వాత ‘సింహా’ లాంటి భారీ చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. ‘సింహా’ బ్లాక్ బస్టర్ అయినా ఆమె కెరీర్ ఊపందుకోకపోవడంతో కొంత కాలానికే తెర మరుగైపోయింది.
This post was last modified on December 28, 2022 12:07 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…