సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఏ చిన్న కదలిక వచ్చినా సరే ఫ్యాన్స్ వెంటనే అలెర్ట్ అయిపోతున్నారు. కొత్త సంగతులు ఏం వింటామాని విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అసలే చిరంజీవి బాలకృష్ణల మధ్య పండగ క్లాష్. ఇంతకన్నా కిక్ ఇచ్చే అంశం మూవీ లవర్స్ కు ఏముంటుంది. అందుకే వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ అనగానే అభిమానులూ తెగ ఎదురు చూశారు. లైవ్ ఆప్షన్ ఇవ్వడంతో కంటెంట్ గురించి ఏమైనా విశేషాలు బయటికి వస్తాయేమోనని శ్రద్ధగా ఫాలో అయ్యారు. దానికి తగ్గట్టే కొన్ని కీలకమైన ఇన్ ఫుట్స్ లీక్స్ సభా వేదికగా టీమ్ సభ్యులు పంచేసుకున్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆ మధ్య గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ రాజా మాట్లాడుతూ కేవలం చిరంజీవి కనుసైగతో ఆ బ్లాక్ ని డిజైన్ చేశానని చెప్పారని, అయితే తనకు అలా ఇష్టం ఉండదని, మాస్ ఊగిపోయే విధంగా ఎనిమిది నిమిషాల పాటు స్క్రీన్ మీద మెగాస్టార్ మాస్ యుఫోరియాని గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో చూపించానని తనలో ఫ్యాన్ బాయ్ ని బయట పెట్టేసుకున్నాడు. మొన్నే ఇంట్రో గురించి చెప్పిన మాటలు మర్చిపోక ముందే ఇప్పుడు విశ్రాంతి గురించి కొంత ఇన్ఫో ఇచ్చేశాడు. పూనకాలు అనే ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణమే ఈ ఎపిసోడ్ అన్న రీతిలో ఓపెన్ అయిపోయాడు.
మరి ఇక్కడ మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మాత్రం బయట పడలేదు. టైటిల్ సాంగ్ లో చూపించిన యాక్షన్ బిట్స్ అన్నీ బహుశా ఈ ఇంటర్వెల్ గురించే అయ్యుండొచ్చు. ఇంతగా చెబుతున్న బాబీ మీద ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెంచేసుకుంటున్నారు. అసలే ఆచార్య చేసిన గాయం ఇంకా మానలేదు. గాడ్ ఫాదర్ హిట్టే కానీ గర్వంగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విధంగా ఫైనల్ వసూళ్లు తగ్గిపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య ఆ లెక్కలన్నీ సరిచేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి బాబీ నిజంగా కాన్ఫిడెన్సా అనేది ఇంకో పదిహేను రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on December 28, 2022 8:40 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…