రోహిత్ శెట్టి అనే బాలీవుడ్లో తోపు డైరెక్టర్. హిందీలో పదికి పైగా వంద కోట్ల సినిమాలు ఇచ్చిన ఘనత అతడి సొంతం. రొటీన్ కథలకే మంచి మసాలా అద్ది ఈజీగా హిట్ చేసేస్తాడని అతడికి పేరుంది. ఎక్కువగా సౌత్ సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అయి అతను సినిమాలు తీస్తుంటాడు.టెంపర్ సహా కొన్ని సౌత్ సినిమాలను రీమేక్ చేసే అతను హిట్లు కొట్టాడు. అలాంటి వాడు ఈ మధ్య సౌత్ సినిమాలను కొంచెం తక్కువ చేసి మాట్లాడాడు. ఓవైపు దక్షిణాది చిత్రాలను కాపీ కొడుతూ ఈ కామెంట్లేంటి అంటూ అతడి మీద సౌత్ నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఐతే అంత బిల్డప్ ఇచ్చిన రోహిత్ శెట్టికి ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. హిట్ మెషీన్‌గా పేరున్న అతడికి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. టెంపర్ రీమేక్ సింబా తర్వాత రణ్వీర్ సింగ్‌తో రోహిత్ తీసిన సర్కస్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
సర్కస్ మీద ముందు మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. దీని ట్రైలర్ తుస్సుమనిపించడంతో అంచనాలు పడిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా జరిగిన సినిమాకు టాక్ కీలకంగా మారింది. కానీ ఇటు రోహిత్, అటు రణ్వీర్ కెరీర్లలో అత్యంత చెత్త సినిమా అనే టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు చుక్కలు కనిపించడం మొదలైంది.
తొలి రోజే చాలా తక్కువ వసూళ్లు రాబట్టిన సర్కస్.. ఆ తర్వాత కూడా ఎంతమాత్రం పుంజుకోలేకపోయింది. పేరుకు భారీ సినిమానే కానీ.. వీకెండ్ మొత్తంలో ఇండియాలో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. ఒకప్పుడైతే ఇలాంటి కాంబినేషన్లో సినిమా రిలీజైతే తొలి రోజే ఈజీగా 20 కోట్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఆడుతోంది. చాలా వరకు బోల్తా కొట్టేస్తున్నాయి. సర్కస్ ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టంగా ఉంది. అంటే దీన్ని కేవలం డిజాస్టర్ అని సరిపెట్టేయలేం. అంతకంటే పెద్ద పదం వాడాలి.
This post was last modified on December 27, 2022 6:25 am
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…