మాస్ మహారాజా రవితేజ నుండి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాయి. అయితే ఈ రెండు సినిమాల్లో రవితేజ ఎనర్జిటిక్ గా బాగానే చేశాడు కానీ కథ -కథనం వీక్ గా ఉండటం, ఆడియన్స్ ను ఆకట్టుకునే మషాలా ఎలిమెంట్స్ లేకపోవడంతో వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ ఏడాది ఫ్లాప్ లతో ఎండ్ చేయడం ఇష్టం లేక ధమాకా తో ఓ బ్లాక్ బస్టర్ హిట్ సెట్ చేసుకున్నాడు మాస్ మహారాజా.
ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ధమాకా మంచి ఓపెనింగ్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. రెండో రోజు, మూడో రోజు కూడా స్ట్రాంగ్ కలక్షన్స్ తో దూసుకెళ్లింది. వీకెండ్ పైగా క్రిస్మస్ అన్నీ కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర మేజిక్ నంబర్స్ అందుకుంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రాపర్ గా కుదిరిన ఈ సినిమా ముప్పై కోట్ల గ్రాస్ తెచ్చుకుంది. ఇక ఈ ఇయర్ లో తన నుండి వచ్చిన రెండు ఫ్లాప్స్ మర్చిపోయేలా ధమాకాతో లెక్క సరి చేసి తన ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి కమర్షియల్ హిట్ సినిమా అందించాడు రవితేజ.
వచ్చే నెలలో సంక్రాంతి వరకు పెద్ద సినిమా లేకపోవడంతో ధమాకా కలెక్షన్స్ మెల్లగా అప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో ధమాకా కేవలం బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా ? లేదా డబుల్ బ్లాక్ బస్టర్ కొడుతుందా ? చూడాలి. వైజాగ్ లో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ తర్వాత ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
This post was last modified on December 26, 2022 9:22 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…