వచ్చే సంక్రాంతికి రాబోయే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బేనర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. సహజంగా ఒక హీరోల పోటీతో పాటు సంక్రాంతి హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం శృతితో శృతికే పోటీ జరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా సంక్రాంతి విన్నర్ శృతినే అవుతుంది.
ఇక రష్మిక కూడా వారసుడుతో శృతి పోటీ ఇవ్వనుంది. కానీ తెలుగు బడా సినిమాల పరంగా చూస్తే మాత్రం ఈసారి శృతి దే పై చేయి కానుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుండి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.
This post was last modified on December 27, 2022 11:59 am
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…