మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న కొత్త చిత్రం.. వాల్తేరు వీరయ్య. చిరంజీవికి వీరాభిమాని అయిన స్టార్ డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఖరారైన దగ్గర్నుంచి బాబీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.. ఇప్పుడు చిరును డైరెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. తన అభిమాన హీరోను ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించబోతున్నానని ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు బాబీ.
ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదని మెగా అభిమానుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బాబీ కలిసి తాజాగా చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో బాబీ మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో అభిమానులు ధీమాగా థియేటర్లకు రావచ్చని అన్నాడు.
తాను చిరు అభిమానిగా ఉన్న రోజులతో మొదలుపెట్టి.. ‘వాల్తేరు వీరయ్య’ను ఎలా తీర్చిదిద్దానో వివరిస్తూ అభిమానుల్లో జోష్ నింపాడు బాబీ. “ఇంద్ర సినిమాకు ముందు చిరంజీవి గారి రెండు సినిమాలు సరిగా ఆడలేదు. ఆయన్నుంచి ఒక బ్లాక్‌బస్టర్ వస్తే చూడాలని కసిగా ఎదురు చూశా. అలాంటి సమయంలో నా ఆకలి తీర్చిన సినిమా.. ఇంధ్ర. ఆ సినిమా చూసి కాలర్ ఎగరేసుకుని తిరిగా. ‘ఇంద్ర’ చూడడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా. అలాంటి నాకు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఈ సినిమాకు సంబంధించి మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను కథ రాస్తూ లేదంటే సినిమా తీస్తూ ఈ మాట చెప్పట్లేదు. సినిమా చూశాక మాట్లాడుతున్నా. చిరంజీవి గారి నుంచి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉణ్నాయి. ఈ సినిమా మెగా అభిమానుల ఆకలి తీరుస్తుందని మాటిస్తున్నా” అని బాబీ చెప్పాడు.
This post was last modified on December 26, 2022 2:17 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…