ఒక మాస్ సినిమా ఎంత రొటీన్ గా ఉన్నా సరైన టైమింగ్ తో రిలీజై ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నా వసూళ్లు ఎలా వస్తాయో ధమాకా మంచి ఉదాహరణగా నిలుస్తోంది. డిసెంబర్ నెలలో ఏర్పడిన బాక్సాఫీస్ గ్యాప్ ని రవితేజ పూర్తిగా వాడుకుని తొలి మూడు రోజులను టాక్ రివ్యూలతో సంబంధం లేకుండా టికెట్ కౌంటర్లను పిండేశాడు. ట్రేడ్ టాక్ ప్రకారం వీకెండ్ కు గాను ధమాకా సుమారు 27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే షేర్ 15 కోట్లను దాటేస్తుంది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ చాలా సులభంగా చేరుతున్నట్టే. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం కలిసి వచ్చేలా ఉంది.
కీలకమైన సోమవారం డ్రాప్ ఎలా ఉందనేది రేపు ఉదయానికి క్లారిటీ వస్తుంది. ఒకవేళ భయపడినంత తగ్గుదల లేదంటే మాత్రం పండగే. అందుకే ధమాకా ముందస్తు జాగ్రత్తగా టూర్లతో పాటు సక్సెస్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది. ఇంకో వారంలోపే సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు మొదలవుతాయి. ఆలోగానే ధమాకాని వీలైనంత ఎక్కువగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి. వాల్తేర్ వీరయ్యలో రవితేజ కూడా ఉన్నాడు కాబట్టి దాని ఈవెంట్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టాక ధమాకా గురించి షేర్ చేయడానికి పెద్దగా ఉండదు. పైగా 18 పేజెస్ బాగా నెమ్మదించేసింది. ఇవాళ్టి నుంచి థియేటర్ల ఆక్యుపెన్సి మీద దెబ్బ పడేలా ఉంది.
నిన్న ఆదివారం ధమాకా లెక్కలు గత రవితేజ చిత్రాల కంటే చాలా ఎత్తులో నిలబడ్డాయి. రామారావు ఆన్ డ్యూటీ మూడో రోజు కేవలం 37 లక్షలు, ఖిలాడీ కోటిన్నర తెచ్చాయి. అంత పెద్ద హిట్ గా చెప్పుకున్న క్రాక్ మూడో రోజు వచ్చింది 3 కోట్ల లోపే. కానీ ధమాకా అనూహ్యంగా 5 కోట్ల మార్కుని దాటడం అరుదైన ఫీట్. శ్రీలీల గ్లామర్, పాటలు, రవితేజ ఎనర్జీ చాలా మైనస్సులను కవర్ చేశాయి. గాడ్ ఫాదర్ లాగా ఇదంతా మూడు నాలుగు ముచ్చటైతే కష్టం. లేదూ ఇదే స్పీడ్ మాములు రోజుల్లో కూడా కొనసాగిస్తే ధమాకా బ్లాక్ బస్టర్ ట్యాగ్ కి పూర్తిగా న్యాయం జరుగుతుంది.
This post was last modified on December 26, 2022 11:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…