Movie News

సినిమా పరిశ్రమకు బిఎఫ్7 టెన్షన్

అన్నీ సర్దుకున్నాయి 2022 బ్రహ్మాండమైన సినిమాలు హిట్లు ఫ్లాపులతో సెలవు తీసుకుని వచ్చే ఏడాది సంక్రాంతితో గ్రాండ్ ఓపెనింగ్ దక్కబోతోందని ఆనందంలో ఉన్న సినిమా పరిశ్రమకు మళ్ళీ కరోనా కేసుల కలవరం విపరీతమైన ఆందోళనకు గురి చేస్తోంది. బిఎఫ్ 7 పేరుతో పిలుస్తున్న కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. కొందరు విదేశీయులను టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో వాళ్ళను ఐసోలేషన్ కు పంపడం, మరొకరికి వ్యాపించకుండా చూడటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పబ్లిక్ లో ఇంకా దీని పట్ల సీరియస్ నెస్ రాలేదు. ఆ ఏం జరుగుతుందనే ధీమాలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం ఎక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్ మొదలయ్యింది. ఇవాళ కోవిద్ డ్రై రన్ తో పాటు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అసలే సంక్రాంతి ఇంకో పదిహేను రోజుల్లో రాబోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం, విద్య వాసుల అహం అంటూ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. థియేటర్ల అగ్రిమెంట్లు, అడ్వాన్సులు ఇచ్చి పుచ్చుకోవడాలు, సంబరాలకు అభిమానుల ఏర్పాట్లు, స్క్రీన్ల పంపకాలు ఇవన్నీ తెరవెనుక భారీ ఎత్తున్న ప్లానింగ్ చేసుకుంటున్నాయి.

ఇలాంటి టైంలో ఏ చిన్న ట్విస్టు వచ్చినా తట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఏవైనా ఆంక్షలంటూ మొదలైతే ముందు ప్రభావితం చెందేది సినిమా పరిశ్రమే. ఒకవేళ రిలీజులు వాయిదా పడినా ఆగిపోయినా వచ్చే నష్టం ఒకటి రెండు కోట్లలో ఉండదు. వాటి మీద వచ్చే వడ్డీతో ఇంకో మీడియం బడ్జెట్ సినిమా తీసేంత లెవెల్ లో ఉంటాయి. ప్రస్తుతానికి చైనాలో తీవ్రంగా ఉన్న ఈ మహమ్మారి మన దేశం గడప తొక్కకుంటే అదే పది వేలు. వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు వగైరా ఎన్ని వేసినా వేయించుకున్నా మళ్ళీ ఇంత తక్కువ గ్యాప్ లో ఈ షాకులు తినాల్సి రావడం మింగుడు పడని విషయమే.

This post was last modified on December 26, 2022 11:25 am

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago