చాలా అరుదుగా కలుసుకున్న సందర్భం బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లది. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్పించి ప్రత్యేకంగా బయట ములాఖాత్ లు చేసుకున్న దాఖలాలు లేవు. చిరంజీవితో బాలయ్యకు ఎంత సాన్నిహిత్యం ఉన్నా అది పవర్ స్టార్ తోనూ అంతే స్థాయిలో లేదన్నది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు క్యాలికులేషన్లు మారిపోతున్నాయి. అన్ స్టాపబుల్ షోకి పవన్ అంగీకారం తెలిపాక ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ప్రభాస్ తో ఎపిసోడ్ ఇంకో మూడో రోజుల్లో స్ట్రీమింగ్ కానుండగా మెగా బ్రదర్ భాగాన్ని ఎల్లుండి షూట్ చేస్తారని తెలిసింది. ఏదో చివరి నిమిషంలో మార్పులు ఉంటే తప్ప ఇదే ఫిక్స్.
ఇది కాకుండా జనవరి 6న ఒంగోలులో ప్లాన్ చేసిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ నే ముఖ్య అతిధిగా పిలవాలనే ప్రతిపాదనకు బాలయ్య సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. పవన్ అంగీకారం రావాల్సి ఉందట. ఇక్కడ ఒకదానికి మరొకదానికి ముడిపడిన లింకులు ఉన్నాయి. వీరసింహారెడ్డి నిర్మాతలు మైత్రి మేకర్సే ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రొడ్యూసర్లు. పైగా ఎప్పటి నుంచో పెండింగున్న కమిట్ మెంట్ ని పవన్ ఇప్పుడు తీరుస్తున్నాడు. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కాదనకపోవచ్చు కానీ అవతల అన్నయ్య వాల్తేరు వీరయ్యకు వెళ్లకుండా దీనికి వస్తారా అనేదే అసలు ప్రశ్న.
ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంక్రాంతికి ఇంకో ఇరవై రోజుల కంటే తక్కువ గడువు ఉంది. ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా చిరు బాలయ్య సినిమాలకు కావాల్సిన బజ్ కనిపిస్తోంది. సరిపడా థియేటర్లు దొరుకుతాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితిని బట్టి ఇప్పుడే చెప్పలేం. ఇంకా ట్రైలర్లు పెండింగ్ ఉన్నాయి. వీరసింహారెడ్డి వేడుకకు ఒకవేళ పవన్ రాలేకపోతే ఎవరిని తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 2022 చివర్లో ఊహించని కాంబోలు, ప్రోగ్రాంలు వినిపిస్తున్నాయి జరిగిపోతున్నాయి. ఇంకేమేం రాబోతున్నాయో
This post was last modified on December 25, 2022 10:02 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…