డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు ప్లాన్ చేసిన వారసుడుకి నిన్న చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. పేరుకి పాటల విడుదలన్నారు కానీ అంతకు మించి చాలానే జరిగాయి.
కిక్కిరిసిపోయిన అభిమాన సందోహం మధ్య నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్వహించిన తీరు చూసి సోషల్ మీడియాలో లీకైన వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూతో అందరూ హాజరయ్యారు. స్టేజి మీద విజయ్ పాట పాడటం, చిన్నగా స్టెప్పు వేయడం లాంటి ఆకర్షణలు తోడయ్యాయి.
ఒక తెలుగు నిర్మాత ఈ స్థాయిలో వేడుక నిర్వహించడం కోలీవుడ్ మీడియాలోనూ హైలైట్ అయ్యింది. సరే అక్కడి సంబరం ముగిసింది కాబట్టి ఇక్కడా అదే స్థాయిలో చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే విజయ్ ఇప్పటిదాకా తన డబ్బింగ్ ఈవెంట్లకు ఎన్నడూ రాలేదు.
కనీసం ఒక ప్రెస్ మీట్ లేదా ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు అలా కుదరదు. రాజుగారు పెద్ద రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి దానికి సహకరించాలి. ఒకవేళ చేస్తే మటుకు హైదరాబాదే మంచి ఆప్షన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అనుకున్నారు కానీ అది జరిగే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతానికి వారసుడుకి ఏపీ తెలంగాణలో ఏమంత బజ్ లేదు. థియేటర్ల పంచాయితీ పక్కనపెడితే భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు లేవు. రంజితమే ఒరిజినల్ లో ఎంత ఛార్ట్ బస్టర్ అయినా మనదగ్గర అంత దూకుడుగా వెళ్ళలేదు. సో హైప్ పెరగాలంటే ఏదో చేయాలి. దానికి ట్రైలర్ ఎంతమేరకు దోహదం చేస్తుందో చెప్పలేం.
ఎందుకంటే వారసుడు ఓ రెగ్యులర్ ఫార్ములాలో వెళ్లే ఫ్యామిలీ కం కమర్షియల్ డ్రామా. జనంలో దీన్ని చూసే తీరాలన్న ఆసక్తి రేపాలంటే పబ్లిసిటీ కంటెంట్ ని బలంగా ప్లాన్ చేసుకోవాలి. మరి దిల్ రాజు మనసులో ఏముందో ఏమేం చేయబోతున్నారో చూడాలి
This post was last modified on December 25, 2022 10:57 am
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…