టాలీవుడ్ బాక్సాఫీస్ కొన్ని నెలల నుంచి డల్లుగా నడుస్తోంది. దసరాకు ‘గాడ్ ఫాదర్’, ఈ నెలలో ‘హిట్-2’ కొంచెం సందడి చేశాయి.. మిగతా సినిమాలు చాలా వరకు తేడా కొట్టేశాయి. క్రిస్మస్ టైంలో సందడి నెలకొంటుందని ఆశిస్తే.. ఈ సీజన్‌కు షెడ్యూల్ అయిన సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ షాకైంది.
మాస్ రాజా రవితేజ సినిమా ‘ధమాకా’.. ‘కార్తికేయ-2’ సక్సెస్ కొట్టిన నిఖిల్-అనుపమ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రాలకు మంచి బజ్ ఉన్నట్లే కనిపించినా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అతి ప్రతిఫలించలేదు. బుక్ మై షోలో ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపించిన స్క్రీన్లు చాలా చాలా తక్కువ. ‘18 పేజెస్’ స్థాయి తక్కువ కాబట్టి ఓకే కానీ.. రవితేజ సినిమాకు ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత వీక్‌గా ఉండడం చూసి చాలామంది షాకైపోయారు. ఇక చిత్ర బృందం కూడా బాగా టెన్షన్ పడే ఉంటుందనడంలో సందేహం లేదు.
కానీ రిలీజ్ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. ‘ధమాకా’ థియేటర్ల దగ్గర బాగానే సందడి కనిపించింది. మార్నింగ్ షోలకు చాలా చోట్ల ఫుల్స్ పడ్డాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, రివ్యూలు కూడా అందుకు తగ్గట్లే ఉన్నా.. ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడినట్లు కనిపించలేదు. సాయంత్రం, రాత్రి షోలకు మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది ‘దమాకా’.
అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉండి, పాజిటివ్ రివ్యూలు తెచ్చుకోని సినిమాకు సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోతుంటాయి. కానీ ‘ధమాకా’ విషయంలో అలా జరగలేదు. మాస్ రాజా ఫ్యాన్స్ ఈ సినిమాతో శాటిస్ఫై అయినట్లే ఉన్నారు. కమర్షియల్ హంగులకు లోటు లేకపోవడం ప్లస్ అయినట్లుంది. తొలి రోజు ఈ చిత్రం రూ.9 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం కూడా ట్రేడ్ వర్గాలకు షాకింగే. ఇది రవితేజ మాస్ ఫాలోయింగ్‌కు నిదర్శనం అని, ఇదే ఊపు శని, ఆదివారాల్లో కూడా కొనసాగితే బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయిపోతారని అంటున్నారు.
This post was last modified on December 24, 2022 9:51 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…