టునీశా శర్మ అనే టాలెంటెడ్ యువ నటి ఆత్మహత్యకు పాల్పడడం ముంబయి సినీ, టీవీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఆమె వయసు కేవలం 20 ఏళ్లు. ఇటు టీవీ షోలతో, అటు సినిమాలతో ఆమె ప్రతిభ చాటుకుంది. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ఈ యువ నటి.. తాను పని చేస్తున్న ఒక టీవీ షోకు సంబంధించిన షూటింగ్ స్పాట్లోనే ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది.
శనివారం ఆమె అలీ బాబ దస్తాన్ ఎ కాబుల్ అనే టీవీ షో షూటింగ్‌లో పాల్గొంటోంది. మధ్యలో బ్రేక్ ఇవ్వగా ఆ సెట్‌లోనే ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అక్కడే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డోర్ కొట్టినా తెరవకపోవడంతో యూనిట్ సభ్యులు దాన్ని పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే టునీషా శర్మను వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు యూనిట్ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యూనిట్లో ఏదో ఒక గొడవ జరిగి ఉంటుందని, ఆ బాధతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. భారత్ కా వీర్ పుత్ర-మహరాణా ప్రతాప్ అనే టీవీ షోతో టునీషా శర్మ అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత చక్రవర్తి అశోక సామ్రాట్, గబ్బర్ పూంచ్ వాలా, షేర్ ఎ పంజాబి, ఇంటర్నెట్ వాలా లవ్.. ఇలా పలు టీవీ షోల్లో నటించింది. వీటితో పాటు బాలీవుడ్లో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కత్రినా కైఫ్ ఫితూర్, సల్మాన్ ఖాన్ దబంగ్-త3తో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించింది. ఇంత చిన్న వయసులో ఆమె ఇలా సెట్లోనే ఆత్మహత్యకు పాల్పడడం షాకింగే.
This post was last modified on December 24, 2022 9:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…