నిన్న విడుదలైన మాస్ మహారాజా ధమాకాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పబ్లిక్ టాక్ రివ్యూలు మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా దసరా తర్వాత స్టార్ హీరోల నుంచి మాస్ సినిమాలు రాకపోవడం రవితేజకు బాగా కలిసి వస్తోంది. సరదాగా థియేటర్ లో ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం ఎంటర్ టైన్మెంట్ దక్కి నెలలవుతున్న కారణంగా జనం బాగానే వెళ్తున్నారు. మాసూద, యశోద లాంటివి పూర్తి సీరియస్ జానర్లు కావడంతో ఒక వర్గం ఆడియన్స్ వాటికి దూరంగా ఉన్నారు. అందుకే ఆ కరువును ధమాకా బాగా వాడుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
వీకెండ్ కావడంతో కేవలం ఈ రెండు మూడు రోజుల కలెక్షన్లని బట్టి స్టేటస్ తేల్చలేం కానీ సోమవారం నుంచి ఏ మేరకు డ్రాప్ ని నిలబెట్టుకుంటుందనేది ఫలితాన్ని శాశిస్తుంది. ఇవన్నీ కాసేపు పక్కనపెడితే ధమాకాలో రొటీన్ కంటెంట్ ఉందన్నది అందరూ ఒప్పుకుంటున్న మాట. రవితేజ ఎనర్జీ, టైమింగ్ మనకు కొత్తేమి కాదు. అయితే తనతో సమానంగా శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ యూత్ కి మాస్ కి బాగా కనెక్ట్ అవుతున్నట్టు హాళ్లలో రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. హీరో ఎంట్రీకి వచ్చిన విజిళ్లు కేకలు హీరోయిన్ వచ్చినప్పుడు అంతే మోతాదులో రావడం గమనార్హం. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లలో.
పాటల్లో చలాకిగా మంచి ఈజ్ తో డాన్స్ చేస్తున్న తీరు బాగా ఆకట్టుకుంటోంది. మాములుగా హీరో వైపు ఉండే కళ్ళు ఈసారి శ్రీలీల వైపు తిరుగుతున్నాయి. చేతి నిండా అవకాశాలున్న ఈ అమ్మడికి సరైన బ్లాక్ బస్టర్ పడాలే కానీ పూజా హెగ్డే, రష్మిక మందన్నలు కూర్చున్న టాప్ ప్లేస్ ని టార్గెట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. డెబ్యూ పెళ్లి సందడి ఫ్లాప్ అయ్యింది. ధమాకా ఎంత తెచ్చినా మరీ కిక్ క్రాక్ రేంజ్ అయితే కాదు. అలాంటప్పుడు ఇంకా పెద్ద స్టార్ జోడిగా ఓ హిట్టు పడితే రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. లక్కీగా సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఛార్ట్ బస్టర్ సాంగ్స్ పడటం శ్రీలీలకు బాగా కలిసొస్తోంది.
This post was last modified on December 24, 2022 12:50 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…