క్రిస్మస్ సినిమాల సందడి పూర్తయింది. ఇక ప్రేక్షకుల చూపు సంక్రాంతి సినిమాల మీదే ఉన్నాయి. వచ్చే ఏడాది పొంగల్ బరిలో చిరు , బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతుండటంతో మూవీ సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలకు షూటింగ్స్ క్లైమాక్స్ వచ్చేశాయి. ఓ వైపు ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు.
ఇదే సంక్రాంతికి విజయ్ , అజిత్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల కాబోతున్నాయి. దిల్ రాజు ‘వారసుడు’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక మైత్రి నిర్మాతలు కూడా రెండు సినిమాలపై గట్టిగా ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారు. యూవీ క్రియేషన్స్ నుండి కూడా ఓ చిన్న సినిమా బరిలో దిగింది. యూవీ నిర్మాతలు ఈ సీజన్ లో తమ సినిమాకు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.
ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు సంబంధించి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాల నిర్మలందరూ భయబ్రాంతులతో అడుగేసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మళ్ళీ కోవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి అని అంటూ ప్రచారం జరుగుతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ కరోన ఎంటరైతే ఎలా పోరాటం చేయాలనే ప్లాన్స్ తో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. చైనాలో ఇప్పటికే కోవిడ్ మరణాలు ఎక్కువవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. చాలా మంది మాస్కులతో బయటికొస్తున్నారు.
మరి ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి జనవరిలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందా ? అనే డైలమాలో పడ్డారు నిర్మాతలు. తమ సినిమాలపై పెట్టుకున్న ఆశలను గుర్తుచేసుకుంటూ లోలోపల భయపడుతున్నారు. ఇక్కడ కోవిడ్ ఎఫెక్ట్ అంతగా లేకపోతే పర్లేదు కానీ లేదంటే సంక్రాంతి సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడుతుంది.
This post was last modified on December 23, 2022 9:57 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…