ఇటివలే ‘పుష్ప 2’ షూటింగ్ మొదలైంది. అంతకు ముందు బన్నీ మీద సైలెంట్ గా స్టూడియోస్ లో కొన్ని సీన్స్ తీశారు. ఆ తర్వాత బన్నీ లేకుండా కొన్ని యాక్షన్ గ్లిమ్స్ తీశారు. ఇదంతా టీజర్ కోసం ప్లాన్ చేసుకున్నారు. కానీ లాస్ట్ మినట్ లో టీజర్ రిలీజ్ చేయకుండా లోలోపల వాయిదా వేసుకున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే బన్నీ పుష్ప 2 టీజర్ అవతార్2 తో పాటు థియేటర్స్ లో ప్లే అవ్వాలి కానీ సెట్ అవ్వలేదు.
ఇక ఇటివల హైదరాబాద్ లో జరిగిన నాలుగు రోజుల షూట్ తర్వాత టీం మళ్ళీ బ్రేక్ తీసుకున్నారు. రెండు, మూడు రోజులు కాకుండా దాదాపు ఇరవై రోజుల పైనే బ్రేక్ తీసుకానున్నారు. అవును పుష్ప 2 రెండో షెడ్యుల్ మొదలయ్యేది జనవరిలోనే. జనవరి 8 లేదా 9 నుంచి ఓ షెడ్యుల్ అనుకుంటున్నారు. అది అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుందా ? డౌటే. ఎందుకంటే లెక్కల మాస్టారు ఇప్పటికే పుష్ప 2 ని నెలల నుండి చెక్కూతూనే ఉన్నారు. బన్నీ కూడా ఈ మధ్యే సుకుమార్ లేకపోతే నాకు ఈ లైఫ్ లేదని, అందుకే షూటింగ్ లేటైనా ఏం అనలేకపోతున్నా అంటూ లోపల తను కూడా ఫీలవుతున్న విషయం బయటపెట్టేశాడు.
ఇప్పటికే పుష్ప రిలీజై ఏడాది దాటేసింది. బన్నీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ‘పుష్ప 2’ షూటింగ్ చక చకా జరిగి వచ్చే ఏడాది మిడిల్ లోనే సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తే బాగుండని భావిస్తున్నారు.
కానీ సుక్కు స్లో అండ్ స్టడీ కంటిన్యూ చేస్తూ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న విధానం చూస్తే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. ఏదేమైనా చేసిన నాలుగు రోజులకే మళ్ళీ ఇంత పెద్ద బ్రేక్ ఎందుకో సుక్కు , బన్నీ కే తెలియాలి.
This post was last modified on December 23, 2022 9:50 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…