ఒక పీరియాడిక్ సినిమాకో లేదా ఓ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా కోసమే టీం ఏకంగా రెండేళ్ళు , మూడేళ్ళు తీసుకున్నారంటే కామన్ కానీ ఓ సింపుల్ కథకి ఎక్కువ టైం తీసుకోవడం కామెడీగానే ఉంటుంది. తాజాగా నిఖిల్ 18 పేజిస్ కి ఇదే జరిగింది. ఈ సినిమాను రెండేళ్ళ క్రితం ప్రారంభించారు. కరోన కంటే ముందే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యలో కొన్ని నెలలు లాక్ డౌన్ తో షూట్ జరగలేదు. నిఖిల్ ‘కార్తికేయ2’ తో పాటు అప్పుడప్పుడు ఈ సినిమాకి కొన్ని డేట్స్ ఇస్తూ వచ్చాడు. అందువల్ల షూట్ కాస్త ఆలస్యంగా జరుగుతూ వచ్చింది.
అయితే దీని కంటే తర్వాత మొదలైన కార్తికేయ 2 ఎప్పుడో రిలీజైతే 18 పెజీస్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీనికి కారణం యూనిట్ రీ షూట్స్ పని ఎక్కువగా పెట్టుకోవడమే. షూట్ ఎప్పుడో పూర్తయినా మధ్యలో రీ షూట్స్ చేస్తూనే వచ్చారు. రిలీజ్ చివరి క్షణం వరకూ ఈ సినిమాకి వెనుక మరమ్మత్తులు జరుగుతూనే ఉన్నాయి. సుకుమార్ రిలీజ్ కి రెండ్రోజుల ముందు ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని కొన్ని డిస్కషన్స్ లేవదీసి మళ్ళీ కొంత రీ ఎడిట్ చేయించారని సమాచారం.
ఇక అనుపమ కూడా రిలీజ్ కి ముందు రోజు వరకూ డబ్బింగ్ చెప్పింది. ఈ విషయం ఆమె స్వయంగా మీడియాతో చెప్పుకుంది. ఓవర్సీస్ వరకు అనుపమ పాత్రకు మరో అమ్మాయి డబ్బింగ్ చెప్పగా తెలుగులో మాత్రం అనుపమ వాయిసే ఉంది. ఇవన్నీ తెలిసాక యూనిట్ ఈ సింపుల్ లవ్ స్టోరీ సినిమా కోసం ఇంత కష్టపడటం అవసరమా ? అనే ప్రశ్న చూసిన చాలా మందికి కలిగింది. సుకుమార్ ఇచ్చిన కథ కూడా కాస్త రొటీన్ గానే ఉంది. కాకపోతే నెరేషన్ కొంత వరకూ ఆకట్టుకుంది. ఆర్టిస్టులు కొందరే, లోకేషన్స్ కూడా ఇక్కడిక్కడే (హైదరాబాద్ లోనే). మరి ఈ పేజీల కోసం టీం చివరి వరకూ కసరత్తులు చేయడం ఎందుకో వారికే తెలియాలి.
This post was last modified on December 24, 2022 10:34 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…