కరోనా తర్వాత బాలీవుడ్ ఎంతగా డీలా పడిపోయిందో.. పెద్ద పెద్ద సినిమాలు ఎలా బోల్తా కొట్టాయో చూశాం. ఎప్పుడో ఒకసారి ఓ సినిమా బాగా ఆడడం.. హమ్మయ్య పరిస్థితి మెరుగుపడిందిలే అనుకుంటే.. మళ్లీ స్లంప్ మొదలుకావడం.. ఇదీ వరస. కొన్ని వారాల కిందట ‘దృశ్యం-2’ బాగా ఆడిందని సంతోషపడితే.. ఆ తర్వాత ప్రతి వారం బాక్సాఫీస్ వెలవెలబోతూనే వస్తోంది.
క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్న ‘సర్కస్’తో మళ్లీ బాక్సాఫీస్‌కు వస్తుందని బాలీవుడ్ జనాలు ఆశించారు. ‘సింబా’ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన రోహిత్ శెట్టి-రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం.. హిట్ మెషీన్‌గా పేరున్న రోహిత్ తన మార్కు ఎంటర్టైనరే ట్రై చేయడంతో సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ఇంకేవో కారణాలు తోడై అడ్వాన్స్ బుకింగ్స్ తుస్సుమనిపించేశాయి.
ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే ‘దృశ్యం-2’ను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ పెద్దగా బజ్ లేకుండా రిలీజైన థ్యాంక్ గాడ్, రక్షాబంధన్ లాంటి చిత్రాల కంటే దీనికి తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత మంచి కాంబినేషన్లో వచ్చిన సినిమా పట్ల కూడా హిందీ ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాక్ బాగున్నా కూడా సినిమా బాగా ఆడుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతుండగా.. టాక్ అటు ఇటు అయితే మాత్రం ‘సర్కస్’ రూపంలో బాలీవుడ్‌కు మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆకర్షణలకైతే లోటు లేదు. రణ్వీర్ సింగ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో రణ్వీర్ సర్కస్‌లో విన్యాసాలు చేసే కుర్రాడిగా కనిపించనున్నాడు. ఇదొక పీరియడ్ ఫిలిం అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
This post was last modified on December 23, 2022 10:58 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…