Movie News

ఒక్క సినిమాపై ఎంత‌మంది ఆశ‌లో..

క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ‌వుతున్న ధ‌మాకా సినిమా దాని హీరో ర‌వితేజ‌కే కాదు చాలామంది కెరీర్ల‌లో చాలా కీల‌క‌మైంది. క్రాక్‌తో గాడిన ప‌డ్డ‌ట్లే క‌నిపించిన మాస్ రాజా కెరీర్‌.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ త‌డ‌బాటుకు గురైంది. ఈ ఏడాది ఆయ‌న ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లాంటి డిజాస్ట‌ర్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇవి రెండూ ఆయ‌న మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా రామారావు కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ ప‌రిస్థితుల్లో ఇంకో ఫ్లాప్ ప‌డితే ర‌వితేజ మార్కెట్ బాగా డౌన్ అయిపోయి ఆయ‌న త‌ర్వాతి సినిమాల మీద ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. కాబ‌ట్టి ఆయ‌న‌కు ఈ సినిమా హిట్ కావ‌డం చాలా అవ‌స‌రం.

ఇక పెళ్ళిసంద‌-డి లాంటి పేల‌వ‌మైన సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయినప్ప‌టికీ… మంచి పేరు సంపాదించి చ‌క‌చ‌కా అవ‌కాశాలు ప‌ట్టేసింది శ్రీలీల‌. ఆమె క‌థానాయిక‌గా నిల‌బ‌డ‌గ‌ల‌దా లేదా అన్న‌ది ధ‌మాకాతో తేలిపోతుంది. ర‌వితేజ ప‌క్క‌న ఆమె జోడీ విష‌యంలో చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రి ఆయ‌న ప‌క్క‌న ఆమె ఎంత‌మాత్రం సూట‌వుతుందో చూడాలి.

ధ‌మాకా రైట‌ర్, డైరెక్ట‌ర్ల‌కు కూడా కీల‌క‌మైన సినిమానే. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున హీరోగా త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తీయ‌డానికి రెడీ అవుతున్నాడు ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ. రైట‌ర్‌గా ఇప్ప‌టికే మంచి విజ‌యాలందుకున్నా.. మెగా ఫోన్ ప‌ట్ట‌డానికి ముందు అత‌ను మ‌రోసారి స‌త్తా చాటాల్సి ఉంది. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లే కాదు.. స్క్రీన్ ప్లే కూడా అత‌డిదే కావ‌డం విశేషం. ఇక ద‌ర్శ‌కుడిగా త్రినాథ‌రావు కూడా త‌న స‌త్తా ఏంటో చూపించడ‌మూ అవ‌స‌ర‌మే. రైటింగ్‌తో పాటు టేకింగ్‌కు కూడా పేరొస్తేనే ఆయ‌న‌కు స‌క్సెస్ క్రెడిట్ ద‌క్కుతుంది. కాబ‌ట్టి సినిమాకు హిట్ టాక్ రావాలి. ఆయ‌న‌కూ మంచి పేరు రావాలి. మ‌రి వీళ్లంద‌రి ఆశ‌ల‌ను ధ‌మాకా ఎంత‌మేర నిల‌బెడుతుందో చూడాలి.

This post was last modified on December 23, 2022 10:44 am

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 minutes ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

24 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago