Movie News

హిట్టో ఫ్లాపో తేల్చేది క్లైమాక్సే..

18 పేజెస్.. క్రిస్మస్ వీకెండ్లో రిలీజ‌వుతున్న చిత్రాల్లో ఒక‌టి. కార్తికేయ‌-2 లాంటి సూప‌ర్ స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్ సిద్దార్థ‌-అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా కావ‌డం.. కుమారి 21 ఎఫ్ త‌ర్వాత సుకుమార్ క‌థ‌తో, ఆయ‌న శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ తీసిన సినిమా కావ‌డంతో ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.

ఐతే ఈ మ‌ధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ కొంచెం డ‌ల్ల‌యిన నేప‌థ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో అయితే సినిమా జోరు చూపించ‌లేక‌పోతోంది. దీనికి పోటీగా రిలీజ‌వుతున్న ధ‌మాకా ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ రెండు చిత్రాల‌కూ పాజిటివ్ టాక్ రావ‌డం కీల‌కం. ఓపెనింగ్స్ మీదైతే మ‌రీ ఆశ‌ల్లేవు. కార్తికేయ‌-2 లాంటి అడ్వంచరెస్ ఫిలిం సూప‌ర్ హిట్ట‌వ‌డంతో నిఖిల్ ఇమేజ్ మారిపోగా.. దాని త‌ర్వాత అత‌ను ప్రేమ‌క‌థ‌తో రావ‌డం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఎగ్జైట్ చేస్తుండ‌క‌పోవ‌చ్చు.

కాగా 18 పేజెస్ ట్రైల‌ర్ చూస్తే ఇది మ‌రీ రొటీన్ ప్రేమ‌క‌థ అయితే కాద‌ని అనిపించింది. క‌థంతా ఒక డైరీ చుట్టూ తిరుగుతుంద‌ని.. హీరో హీరోయిన్లు చివ‌రిదాకా క‌లుసుకోకుండా ప్రేమించుకుంటార‌ని కూడా అర్థ‌మైంది. ఐతే ఈ రోజుల్లో ఇలాంటి పాయింట్ ఏమాత్రం వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న సందేహాలు కూడా క‌లిగాయి.

ఐతే సుకుమార్ క‌థ కాబ‌ట్టి అది ఆషామాషీగా అయితే ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ పాయింట్ చుట్టూ సుకుమార్ ఏదో ఒక ట్విస్టు ఇచ్చి ఉంటాడ‌నే భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. 18 పేజెస్ క్లైమాక్స్ గురించి చిత్ర యూనిట్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీలోనూ ఒక చ‌ర్చ న‌డుస్తోంది.

అది కుమారి 21 ఎఫ్ త‌ర‌హాలోనే స్ట‌న్నింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. హీరో నిఖిల్ సైతం మీడియా ఇంట‌ర్వ్యూల్లో క్లైమాక్స్ గురించి ప్ర‌స్తావించాడు. క‌థ చెప్పిన‌పుడు తాను క్లైమాక్స్‌ను గెస్ చేయ‌లేక‌పోయాన‌న్నాడు. దీంతో ఏంటా క్లైమాక్స్ అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంద‌న్న‌దాన్ని బ‌ట్టే సినిమా ఫ‌లితం కూడా ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

This post was last modified on December 22, 2022 10:11 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

19 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

28 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

42 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

44 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago