టాలీవుడ్లో కొత్త, అప్ కమింగ్ డైరెక్టర్ల పాలిట దేవుడు అని రవితేజను అందరూ కొనియాడుతుంటారు. శ్రీను వైట్ల, యోగి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, శరత్ మండవ.. ఇలా రవితేజ పరిచయం చేసిన దర్శకుల జాబితా చాలా పెద్దదే. వీళ్లలో చాలామంది పెద్ద రేంజికి వెళ్లారు. ఆ స్థాయి అందుకున్నాక కూడా రవితేజ మీద తమ అభిమానాన్ని, కృతజ్ఞతాభావాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటారు. అలాంటి దర్శకుల్లో బాబీ ఒకడు.
రవితేజ గురించి ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే.. అతను ఎమోషనల్ అయిపోతుంటాడు. రవితేజను ఆకాశానికెత్తేస్తుంటాడు. రవితేజ కొత్త చిత్రం ‘ధమాకా’ రిలీజ్ నేపథ్యంలో అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనిలతో కలిసి చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బాబీ తానెందుకు రవితేజ ఊసెత్తితే ఎమోషనల్ అవుతానో, అసలు రవితేజ గొప్పదనం ఏంటో వివరించే ప్రయత్నం చేశాడు.
‘‘నేను బలుపు సినిమాకు రచయితగా పని చేస్తున్న సమయంలో తర్వాతేం చేద్దామనుకుంటున్నావ్ అబ్బాయ్ అని రవితేజ అడిగాడు. నేను డైరెక్షన్ చేయడమే గోల్ అని చెప్పా. మరి కథేమైనా రెడీ చేసుకున్నావా అంటే. అవునన్నా. ఈ సినిమా నడుస్తుండగా నాకు కథ చెప్పు అన్నాడు. నేను ‘పవర్’ సినిమా లైన్ చెప్పా. ‘బలుపు’ సినిమా సగం అయ్యేసరికి.. మనం ఈ కథతో సినిమా చేద్దాం అనేశాడు. తన అసిస్టెంట్ శ్రీనివాసరాజు దగ్గర డబ్బులు తీసుకుని రైటర్లతో కలిసి స్క్రిప్టు డెవలప్ చేయమన్నాడు. ఐతే బలుపు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక నాతో సినిమా చేస్తారని నమ్మకం కలగలేదు. కానీ రవితేజ తర్వాత నా దగ్గరికి వచ్చి నిర్మాతలు రంగంలోకి దిగుతున్నారు, స్క్రిప్టు రెడీనా అనడిగాడు.
ఇంతలో ఒక రోజు శ్రీనివాసరాజు ఫోన్ చేసి.. ‘బలుపు’ లాంటి హిట్ తర్వాత కొత్త దర్శకుడితో ఎందుకు, అతడి కథ తీసుకుని వేరే వాళ్లతో చేద్దాం అని రవితేజకు తాను సలహా ఇచ్చానని, కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదని నాతో చెప్పాడు. బాబీ కథ చెబుతున్నపుడు ఇతను తీయగలడు అనిపించింది, కాబట్టి అతనే డైరెక్షన్ చేయనివ్వు అని రవితేజ చెప్పినట్లు నాతో అనడంతో నాకు మాటలు రాలేదు. నన్ను ఆ దశలో అంత నమ్మారు. ‘పవర్’ సినిమా వల్ల నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నానంటే అందుకు రవితేజ గారే కారణం. నేను ఏ స్టేజ్ ఎక్కుతున్నా.. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, దీనికంతటికీ కారణం ఎవరు అని ఆలోచిస్తుంటే రవితేజగారు గుర్తుకొస్తుంటారు. అందుకే ఆయన విషయంలో నేను ఎమోషనల్ అయిపోతా’’ అని బాబీ వెల్లడించాడు.
This post was last modified on December 22, 2022 2:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…